Ratan Tata:దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
1937 డిసెంబర్ 28న జన్మించిన రతన్ టాటా, 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు.
అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు.
టాటా ఛారిటబుల్ ట్రస్టులకు అధిపతి రతన్ టాటా. ఆయన దేశ అత్యున్నత పౌర పురస్కారాలు అయిన పద్మవిభూషణ్ (2008), పద్మభూషణ్ (2000) లను అందుకున్నారు.
వ్యాపారంలో విలువలు పాటించి, దాతృత్వంలో గుర్తింపు పొందిన వ్యక్తిగా పేరుగాంచారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రతన్ టాటా, ఇండస్ట్రీ లెజెండ్,నేషనల్ ఐకాన్, 86 ఏళ్ళ వయసులో మరణించారు
Ratan Tata, Industry Legend And National Icon, Dies At 86#RatanTata #TataGroup #Philanthropist pic.twitter.com/N6qbQyidMV
— NDTV (@ndtv) October 9, 2024
వివరాలు
ట్విట్టర్ వేదికగా హర్ష గోయెంకా సంతాపం
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా చనిపోయారంటూ హర్ష గోయెంకా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
'గడియారం టిక్ చేయడం ఆగిపోయింది. టైటాన్ చనిపోయింది. రతన్ టాటా సమగ్రత, నైతిక నాయకత్వం, దాతృత్వం అనే విషయాల్లో ఒక వెలుగు వెలిగారు. ఆయన వ్యాపార రంగంలోనే కాకుండా వెలుపలి ప్రపంచంలో కూడా చెరగని ముద్ర వేశారు. ఆయన మా జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచిపోతారు. ఆర్.ఐ.పి' అంటూ హర్ష గోయెంకా ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హర్ష గోయెంకా చేసిన ట్వీట్
The clock has stopped ticking. The Titan passes away. #RatanTata was a beacon of integrity, ethical leadership and philanthropy, who has imprinted an indelible mark on the world of business and beyond. He will forever soar high in our memories. R.I.P pic.twitter.com/foYsathgmt
— Harsh Goenka (@hvgoenka) October 9, 2024
వివరాలు
రతన్ టాటా ముత్తాత స్థాపించిన గ్రూప్
రతన్ టాటా 1991లో టాటా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
తన ముత్తాత స్థాపించిన టాటా గ్రూప్‌ను 2012 వరకు విజయవంతంగా నడిపించారు.
1996లో టాటా టెలీ సర్వీసెస్ అనే టెలికమ్యూనికేషన్స్ కంపెనీని స్థాపించారు.
2004లో ఐటి రంగంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)ను ప్రారంభించారు.
ఆయనను దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో ఒకరిగా గుర్తించారు. అంతకుమించి, రతన్ టాటా ఒక గొప్ప మానవతావాది.
టాటా గ్రూప్ సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
వివరాలు
టాటా గ్రూప్ ఛారిటబుల్ ట్రస్టులకు నాయకత్వం
ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది.
రతన్ టాటా ప్రస్తుతం టాటా గ్రూప్ ఛారిటబుల్ ట్రస్టులకు నాయకత్వం వహిస్తున్నారు.
వ్యాపార రంగంలో రతన్ టాటా చేసిన సేవలకు గుర్తింపుగా 2000లో కేంద్రం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం వరించింది.
2008లో దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్‌తో ఆయనను కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.