Ratan Tata's Shocking Will: రతన్ టాటా వీలునామాలో మిస్టరీ మ్యాన్ పేరు..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata) కేవలం లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా మాత్రమే కాకుండా, గొప్ప మానవతావాదిగా, సమాజ సేవకుడిగా పేరుపొందారు.
ఆయన తన అపార ఆస్తిని ఉద్యోగులకే కాకుండా, తనకు అత్యంత ప్రీతిపాత్రమైన పెంపుడు శునకాలకు కూడా కేటాయిస్తూ వీలునామా రచించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడా వీలునామాలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ఇందులో ఓ రహస్య వ్యక్తికి ఏకంగా రూ.500 కోట్లు అప్పగించాలని రతన్ టాటా పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఈ వార్త తెలియగానే ఆయన సన్నిహితులు ఆశ్చర్యానికి గురయ్యారు.
వివరాలు
ఆరు దశాబ్దాలుగా రతన్ టాటా నమ్మకస్తుడిగా మోహన్ దత్తా సేవలు
సదరు రహస్య వ్యక్తి జంషెడ్‌పుర్‌కు చెందిన ట్రావెల్స్ వ్యాపారవేత్త మోహిని మోహన్ దత్తా (Mohini Mohan Dutta) అని పలు మీడియా వర్గాలు వెల్లడించాయి.
మోహన్ దత్తా దాదాపు ఆరు దశాబ్దాలుగా రతన్ టాటా నమ్మకస్తుడిగా సేవలు అందించారు.
2013 నుండి తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో భాగమైన తాజ్ సర్వీసెస్‌తో ఆయన ట్రావెల్ ఏజెన్సీ "స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీ" కలిసి పని చేస్తోంది.
టాటా గ్రూప్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం,మోహన్ దత్తా టాటా కుటుంబానికి అత్యంత సమీపంగా ఉండేవారు.
రతన్ టాటా మరణానంతరం,దత్తా ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ,టాటాను 24 ఏళ్ల వయస్సు నుంచి తనకు తెలుసని,తన జీవితంలో ఎదగడంలో ఆయన సహకారం అమూల్యమని పేర్కొన్నారు.
వివరాలు
రతన్ టాటా జన్మదిన వేడుకలకు దత్తాకు ప్రత్యేక ఆహ్వానం
2024 డిసెంబర్‌లో ముంబయిలోని ఎన్సీపీఏ (NCPA)లో నిర్వహించిన రతన్ టాటా జన్మదిన వేడుకలకు దత్తా ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారని సమాచారం.
ఇక, రతన్ టాటా వీలునామాలో మూడు దశాబ్దాలుగా తనతో ఉంటూ సేవలు అందించిన వ్యక్తిగత సహాయకులు రాజన్ షా, సుబ్బయ్య, అలాగే అతని ప్రియమైన పెంపుడు శునకం టిటో పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
టాటా సుమారు రూ.10,000 కోట్లకు పైగా విలువైన ఆస్తిని తన స్థాపించిన ఫౌండేషన్లకు, సోదరుడు జిమ్మీ టాటాకు, నమ్మకమైన సహాయకులకు, ఇతర అవసరమైన వ్యక్తులకు కేటాయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.