
RBI: ఆర్బీఐ యాక్షన్.. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా బ్యాంకులకు భారీ జరిమానాలు
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళికి ముందే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. బ్యాంకులు కేవైసీ (KYC) ఇతర బ్యాంకింగ్ నియమాలను ఉల్లంఘించిందని గుర్తించి ఐదు సహకార బ్యాంకులకు ఆర్బీఐ బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 47A(1)(c), సెక్షన్ 46(4)(i) సెక్షన్ 56 కింద జరిమానాలు విధించింది. ఈ జాబితాలో బీహార్, పశ్చిమ బెంగాల్ నుండి రెండు బ్యాంకులు, ఒడిశా నుండి ఒక బ్యాంకు ఉన్నాయి. RBI అక్టోబర్ 16న విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా ఈ చర్యను ప్రకటించింది. మార్చి 31, 2024న బ్యాంకుల ఆర్థిక స్థితిని తనిఖీ చేసినప్పటి నుండి, కొన్ని మార్గదర్శకాలు సరియైన విధంగా పాటించబడలేదని తేలింది.
Details
బీహార్‌లో జరిమానాలు
RBI అన్ని బ్యాంకులకు షో-కాజ్ నోటీసులు జారీ చేసి, సమాధానాలు, వ్యక్తిగత విచారణ, ప్రజెంటేషన్ల ఆధారంగా ఉల్లంఘనలను నిర్ధారించింది. ఆ తర్వాత జరిమానాలు విధించాల్సిన నిర్ణయం తీసుకుంది. గోపాల్‌గంజ్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్: KYC రికార్డులను సెంట్రల్ KYC రిజిస్ట్రీలో సమయానికి అప్‌లోడ్ చేయకపోవడంతో రూ.5.50 లక్షల జరిమానా. బెగుసరాయ్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్: సమయానుకూల KYC అప్‌లోడ్ విఫలమవడంతో రూ.1.40 లక్షల జరిమానా
Details
పశ్చిమ బెంగాల్‌లో జరిమానాలు
రాణాఘాట్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్: KYC రికార్డులు సకాలంలో అప్‌లోడ్ చేయకపోవడం కారణంగా రూ.5 లక్షల జరిమానా. ఘటల్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్: ఖాతాల రిస్క్ వర్గీకరణ సమీక్షలో, KYC అప్‌లోడ్ లో విఫలం, అలాగే కొన్ని బ్యాంకింగ్ ఆస్తులను సరైన వ్యవధిలో పారవేయకపోవడంతో రూ.5.50 లక్షల జరిమానా. సహారా హౌసింగ్‌ఫినా కార్పొరేషన్ లిమిటెడ్: KYC రికార్డులు సమయానికి అప్‌లోడ్ చేయకపోవడం కారణంగా రూ.50,000 జరిమానా.
Details
ఒడిశాలో జరిమానా
బౌధ్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్: మూడు క్రెడిట్ సమాచార సంస్థలకు కస్టమర్ రుణ సమాచారాన్ని సమర్పించకపోవడం వల్ల రూ.10,000 జరిమానా. కస్టమర్లు, బ్యాంకుల మధ్య ఎటువంటి లావాదేవీలను ప్రభావితం చేయదని స్పష్టం ఆర్ బి ఐ చేసింది.