
RBI : పదేళ్లు దాటిన పిల్లలకు బ్యాంక్ ఖాతా నిర్వహణకు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్!
ఈ వార్తాకథనం ఏంటి
పదేళ్ల వయసు మించిన పిల్లలకు బ్యాంకింగ్ స్వాతంత్య్రం కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇప్పటివరకు మైనర్లు బ్యాంకు ఖాతాలు ఉన్నా అవి తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ల ఆధ్వర్యంలోనే నిర్వహించాల్సి వచ్చేది.
అయితే తాజాగా ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో పదేళ్ల వయసు మించిన పిల్లలు ఇకపై సేవింగ్స్, టర్మ్ డిపాజిట్ ఖాతాలను స్వయంగా నిర్వహించుకునే అవకాశం కలగనుంది.
ఇకపై వారు తామే ఖాతా నిర్వహణ బాధ్యతలు తీసుకోవచ్చు.
Details
జూలై 1 నుంచి అమలు
అంతేకాదు, వారిచే సంతక నమూనా (స్పెసిమెన్ సిగ్నేచర్), ఇతర కీలక వివరాలను తిరిగి సమర్పించాల్సి ఉంటుంది.
ఈ ఖాతాదారులకు బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం లేదా డెబిట్ కార్డు, చెక్ బుక్ వంటి సదుపాయాలను కూడా అందించవచ్చు.
ఈ మార్పులను 2025 జూలై 1వ తేదీ నుంచి అమలు చేయాలని ఆర్‌బీఐ అన్ని బ్యాంకులకు స్పష్టంగా సూచించింది.
చిన్నారుల ఆర్థిక జ్ఞానాన్ని పెంపొందించేందుకు, వారి భవిష్యత్తుకు బలమైన ఆర్థిక పునాది వేయడానికి ఈ నిర్ణయం దోహదపడనుంది.