RBI: క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు కొత్త నిబంధనలు.. వినియోగదారులకు ఊరట.. ఆర్బీఐ కొత్త రూల్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ఊరట ఇచ్చింది. క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై కొత్త నిబంధనలు తీసుకొచ్చిన ఆర్బీఐ, డ్యూ డేట్ తర్వాత వెంటనే లేట్ ఫీజులు వేయకుండా 3 రోజుల గడువు ఇవ్వాలని నిర్ణయించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, డ్యూ డేట్ తర్వాత మూడు రోజులు గడిచినా చెల్లింపు చేయకపోతేనే అకౌంట్‌ను "పాస్ట్ డ్యూ"గా పరిగణిస్తారు. అలాగే జరిమానాలు కూడా అప్పటి నుంచి మాత్రమే అమలు అవుతాయి.
వివరాలు
2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు
మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే, ఇకపై మొత్తం బిల్లు మీద కాకుండా డ్యూ డేట్ తర్వాత మిగిలిన బాకీపై మాత్రమే లేట్ ఫీజులు వసూలు చేయాలి. అయితే డిలే లెక్కింపు మాత్రం డ్యూ డేట్ నుంచే మొదలవుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. అంటే జరిమానా మూడు రోజులు ఆలస్యంగా పడినా, ఆలస్యమైన రోజుల లెక్క మాత్రం మొదటి రోజు నుంచే కొనసాగుతుంది. ఈ మార్పులతో కార్డ్ హోల్డర్లకు కొంత ఊరట లభించినా, డ్యూ డేట్ మాత్రం అలాగే ఉంటుంది. వడ్డీలు, బిల్లింగ్ సైకిల్‌లో ఎలాంటి మార్పులు ఉండవు. ఈ కొత్త నిబంధనలు 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.