Loading...
RBI: లోన్ వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రతిపాదనలు.. కస్టమర్లకు మరింత రక్షణ
లోన్ వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రతిపాదనలు.. కస్టమర్లకు మరింత రక్షణ

RBI: లోన్ వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రతిపాదనలు.. కస్టమర్లకు మరింత రక్షణ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 17, 2026
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇల్లు, కారు కొనుగోలు లేదా ఇతర అవసరాల కోసం రుణం తీసుకున్న వారికి, భవిష్యత్తులో లోన్ తీసుకోవాలనుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రతిపాదనలు చేసింది. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తమకు నచ్చినట్లు లోన్ నిబంధనలను, ముఖ్యంగా వడ్డీ రేట్లకు ఆధారంగా ఉండే 'బెంచ్‌మార్క్'లను మార్చకుండా నియంత్రించేందుకు ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. రుణాల వడ్డీ రేట్లలో మరింత పారదర్శకత తీసుకురావడమే ఈ ప్రతిపాదనల ప్రధాన ఉద్దేశం.

వివరాలు 

కస్టమర్ అనుమతి లేకుండా బెంచ్‌మార్క్ మార్చలేరు

ఇప్పటివరకు కొన్ని సందర్భాల్లో బ్యాంకులు రుణగ్రహీతకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే బెంచ్‌మార్క్ విధానాలను మార్చే పరిస్థితులు ఉన్నాయి.

అయితే ప్రతిపాదిత కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై రుణం తీసుకున్న వ్యక్తి అనుమతి లేకుండా బ్యాంకులు బెంచ్‌మార్క్‌ను మార్చడానికి వీలుండదు.

ఒకవేళ బెంచ్‌మార్క్ మార్చాల్సిన పరిస్థితి వస్తే.. ఆ మార్పు కారణంగా కస్టమర్‌కు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలి.

అంతేకాకుండా ఈ మార్పు ప్రక్రియ కోసం రుణగ్రహీతల నుంచి ఎలాంటి అదనపు రుసుమును వసూలు చేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

వివరాలు 

ఈఎంఐ భారం పెరగకుండా చర్యలు

ఫ్లోటింగ్ రేట్ లోన్లు తీసుకున్న వారికి ఈ ప్రతిపాదిత నిబంధనలు ముఖ్యంగా ప్రయోజనం కలిగించనున్నాయి.

ఒక బెంచ్‌మార్క్ నుంచి మరో బెంచ్‌మార్క్‌కు రుణాన్ని మార్చినప్పుడు.. కొత్త వడ్డీ రేటు గతంలో ఉన్న వడ్డీ రేటు కంటే ఎక్కువగా ఉండకూడదని ఆర్బీఐ ప్రతిపాదించింది.

దీంతో కేవలం బ్యాంకు తీసుకున్న ఏకపక్ష నిర్ణయం కారణంగా కస్టమర్ చెల్లించే నెలవారీ ఈఎంఐ లేదా వడ్డీ భారం ఒక్కసారిగా పెరిగే అవకాశం తగ్గుతుంది.

ముఖ్యంగా ఫ్లోటింగ్ రేట్ రుణాలు తీసుకున్నవారికి ఇది ఆర్థిక ప్రణాళికలను మరింత స్థిరంగా కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది.

ADVERTISEMENT

వివరాలు 

పాత బెంచ్‌మార్క్ రద్దయితే ఏం జరుగుతుంది?

లోన్ అగ్రిమెంట్‌లో పేర్కొన్న పాత బెంచ్‌మార్క్‌ను ఏదైనా కారణంతో రద్దు చేస్తే.. కస్టమర్‌పై ప్రతికూల ప్రభావం పడకుండా మరో బెంచ్‌మార్క్‌కు రుణాన్ని మార్చాల్సి ఉంటుంది.

ఇందుకు సంబంధించిన ప్రత్యామ్నాయ బెంచ్‌మార్క్ వివరాలను లోన్ అగ్రిమెంట్‌లోనే ముందుగా స్పష్టంగా పేర్కొనాలి.

అలాగే ఒక రుణం మరో సంస్థకు బదిలీ అయిన సందర్భంలోనూ రుణగ్రహీతకు రక్షణ కల్పించేలా నిబంధనలు ఉండనున్నాయి.

అధికారికంగా బ్యాంకు లేదా రుణ సంస్థ పేరు మారే వరకు పాత వడ్డీ రేట్లు, నిబంధనలే కొనసాగుతాయి.

కస్టమర్ కొత్త అగ్రిమెంట్‌పై సంతకం చేసిన తర్వాత మాత్రమే కొత్త సంస్థకు సంబంధించిన నిబంధనలు వర్తిస్తాయి.

ADVERTISEMENT

వివరాలు 

2027 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం

ఆర్బీఐ ప్రతిపాదించిన ఈ కొత్త నిబంధనలు 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం కొనసాగుతున్న పాత రుణాలను కూడా కొత్త విధానంలోకి తీసుకురావాలని ఆర్బీఐ ప్రతిపాదించింది.

ఇందుకు 2029 ఏప్రిల్ 1 వరకు గడువు ఇవ్వాలని సూచించింది. ఇకపై రుణాల వడ్డీ రేట్లను ఎంత కాలానికి ఒకసారి మార్చుతారు? మార్పు ఎప్పుడు అమల్లోకి వస్తుంది? అనే వివరాలను బ్యాంకులు కస్టమర్లకు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.

దీంతో తమకు తెలియకుండానే వడ్డీ రేట్లు పెరిగిపోతాయనే ఆందోళన రుణగ్రహీతల్లో తగ్గే అవకాశం ఉంది.

వివరాలు 

కస్టమర్ల ఆర్థిక ప్రణాళికలకు రక్షణ

బ్యాంకుల నిర్ణయాల కారణంగా కస్టమర్ల ఆర్థిక ప్రణాళికలు ఒక్కసారిగా మారిపోకుండా ఈ నిబంధనలు రక్షణ కల్పించనున్నాయి.

ముఖ్యంగా వడ్డీ రేట్లు, బెంచ్‌మార్క్ మార్పుల్లో పారదర్శకత పెంచడంతో రుణగ్రహీతలకు ముందుగానే పరిస్థితిపై స్పష్టత లభిస్తుంది.

మొత్తంగా చూస్తే.. లోన్ తీసుకున్న కస్టమర్ల ప్రయోజనాలను కాపాడే భద్రతా కవచంగా ఈ కొత్త నిబంధనలు పనిచేసే అవకాశం ఉంది.

ADVERTISEMENT