
RBI: రూ.100, 200 నోట్లపై ఆర్‌బీఐ కీలక ఆదేశాలు.. సెప్టెంబరు వరకూ డెడ్‌లైన్!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ), రూ.100, రూ.200 నోట్ల పంపిణీపై కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రజలకు చిన్న డినామినేషన్ నోట్ల లభ్యత పెరగాలన్న ఉద్దేశంతో ఆర్బీఐ సోమవారం అన్ని బ్యాంకులకు, అలాగే వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు (WLAO) ప్రత్యేకంగా సర్క్యులర్ పంపించింది.
ఏటీఎంలపై ఆర్బీఐ ఫోకస్
బ్యాంకులు నిర్వహించే ఏటీఎంలతో పాటు, బ్యాంకింగ్ కాని సంస్థలు నిర్వహించే వైట్ లేబుల్ ఏటీఎంలు కూడా ఇకపై రూ.100 లేదా రూ.200 నోట్లు తప్పనిసరిగా అందించాలి.
ఇది దశలవారీగా అమలు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. చిన్న డినామినేషన్ నోట్లు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Details
టైమ్‌లైన్ ఇలా ఉంటుంది
సెప్టెంబర్ 30, 2025 నాటికి - కనీసం 75శాతం ఏటీఎంలలో ఒక్కటైనా క్యాసెట్ రూ.100 లేదా రూ.200 నోట్ల కోసం ఉండాలి.
మార్చి 31, 2026 నాటికి - కనీసం 90శాతం ఏటీఎంలలో అలాంటి క్యాసెట్ తప్పనిసరిగా ఉండాలి.
ఈ మార్గదర్శకాలు అమలులోకి వచ్చిన తర్వాత ప్రజలకు చిన్ననోట్ల అవసరం తీర్చడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు.
రూ.100, రూ.200 నోట్లు ప్రజల నిత్యవసరాల లావాదేవీల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారన్న కారణంతో ఈ ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.
Details
చిన్న నోట్లపై ఆర్బీఐ దృష్టి
అంతేకాకుండా, అన్ని బ్యాంకులు ఈ మార్గదర్శకాలను పాటిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఇది ప్రజలకు ఉపయోగకరమైన మార్గదర్శకమని, బ్యాంకులు వెంటనే ఈ అంశాన్ని అమలు చేయాలని ఆర్బీఐ సూచించింది.
ఇలా చూస్తే, ఇకపై ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లు లభించకపోవడమనే సమస్యకు ముగింపు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.