
Gold loans: ఆర్‌బీఐ కొత్త నిర్ణయం.. త్వరలో ఈఎంఐ పద్ధతిలో బంగారు రుణాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి బంగారాన్ని తాకట్టు పెట్టుకోవడం ఒక సాధారణ ప్రక్రియగా మారింది.
అయితే ప్రస్తుతం ఈ రుణాలు బుల్లెట్ రీపేమెంట్ పద్ధతిలో ఉంటాయి. అంటే రుణ గ్రహీతకు ఒకేసారి మొత్తం రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
ఇది కొంతమంది రుణగ్రహీతలకు ఆర్థికంగా భారంగా మారనుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) త్వరలో ఈ రుణాలను ఈఎంఐ పద్ధతిలో చెల్లించే అవకాశం కల్పించాలని భావిస్తోంది.
బంగారం విలువ నిర్ధారణలో లోపాలు, వేలం పారదర్శకతలో చిక్కులు, వడ్డీ కింద కొంత మొత్తాన్ని మాత్రమే చెల్లించి దీర్ఘకాలికంగా రుణాలను కొనసాగించే పద్ధతులపై ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది.
Details
రూ. 1.4 లక్షల కోట్ల విలువైన బంగారు రుణాలు మంజూరు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు సుమారు రూ. 1.4 లక్షల కోట్ల విలువైన బంగారం రుణాలను మంజూరు చేసినట్లు ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి.
గతేడాది ఇదే సమయంలో ఉన్న రుణాలతో పోలిస్తే, ఇది 14.6% పెరుగుదలను చూపుతుంది. బంగారం ధరల పెరుగుదల ఈ రుణాల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ సమయానికి ఆర్‌బీఐ ఈ పథకం ద్వారా రుణాల చెల్లింపు పద్ధతిని సౌలభ్యంగా మార్చాలని భావిస్తోంది.
తద్వారా రుణ గ్రహీతలకు ఎలాంటి ఆర్థిక ఒత్తిడులూ లేకుండా తమ రుణాలను సమర్థంగా మలచుకునే అవకాశం లభిస్తుంది.