Loading...
Elon Musk: బీజేపీ ప్రచారానికి రిలయన్స్ నిధులు? మీడియా కథనాలను షేర్ చేసిన మస్క్‌!
బీజేపీ ప్రచారానికి రిలయన్స్ నిధులు? మీడియా కథనాలను షేర్ చేసిన మస్క్‌!

Elon Musk: బీజేపీ ప్రచారానికి రిలయన్స్ నిధులు? మీడియా కథనాలను షేర్ చేసిన మస్క్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 10, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్‌లింక్‌ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలకు భారత్‌లో అనుమతులు మంజూరు కావడంలో జరుగుతున్న జాప్యంపై టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి గతంలో ప్రచురితమైన కొన్ని మీడియా కథనాలను తాజాగా తన ఎక్స్‌ (X) ఖాతాలో షేర్‌ చేసిన ఆయన.. బీజేపీ, రిలయన్స్‌ సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారు. బీజేపీ ప్రచారానికి రిలయన్స్‌కు సంబంధించిన 'క్విక్‌ సప్లయ్‌' సంస్థ గతంలో నిధులు సమకూర్చిందనేది ఆ కథనాల సారాంశం.

వివరాలు

ఎలాంటి సంబంధం లేదు

ఈ నేపథ్యంలో స్టార్‌లింక్‌ సేవలకు అనుమతుల జాప్యంపై మస్క్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే 'క్విక్‌ సప్లయ్‌' కంపెనీతో తమకు ఎలాంటి సంబంధం లేదని రిలయన్స్‌ సంస్థ గతంలోనే స్పష్టం చేసింది.

స్టార్‌లింక్‌ అనుమతుల వ్యవహారం, మస్క్‌ తాజాగా షేర్‌ చేసిన కథనాలతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT