Reliance: రిలయెన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనం.. యాపిల్‌కు షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
రిలయెన్స్ ఇండస్ట్రీస్ 2024లో అంతర్జాతీయ అత్యుత్తమ బ్రాండ్ల జాబితాలో రెండో స్థానాన్ని సాధించింది.
ఫ్యూచర్‌బ్రాండ్ సంస్థ రూపొందించిన ఈ జాబితాలో యాపిల్, నైక్ వంటి ప్రముఖ బ్రాండ్లను మించిపోయి, భారతీయ దిగ్గజం రిలయన్స్ టాప్ 2లో చేరింది.
మార్కెట్ మార్పులను ముందే అంచనా వేసి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం, బ్రాండ్ ప్రయోజనాలు నిర్వహించడం వంటి అంశాల ఆధారంగా ఈ జాబితా రూపొందించింది.
Details
శాంసంగ్ తర్వాత రిలయెన్స్
జాబితాలో దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ అగ్ర స్థానంలో నిలవగా, రిలయన్స్ రెండవ స్థానాన్ని ఆక్రమించింది.
గత ఏడాదిలో ఐదో స్థానంలో ఉన్న శాంసంగ్ ఈ సారి టాప్ 1లో చేరింది.
2023లో 13వ స్థానంలో ఉన్న రిలయన్స్ 11 స్థానాలు ఎగబాకి, ఈసారి టాప్ 2లోకి చేరడం విశేషం.
ఈ జాబితాలో యాపిల్, నైక్, వాల్ట్ డిస్నీ, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, టొయోటా వంటి దిగ్గజ బ్రాండ్లను దాటి రిలయన్స్ ఈ ఘనత సాధించింది.
Details
2024 జాబితాలో నిలిచిన టాప్ 10 బ్రాండ్లు
1. శాంసంగ్ (దక్షిణ కొరియా) 2. రిలయన్స్ (భారత్) 3. యాపిల్ (అమెరికా)
4. నైక్ (అమెరికా) 5. ఏఎస్‌ఎంఎల్ సెమీ కండక్టర్స్ (నెదర్లాండ్స్)
6. డెనహర్ కార్పొరేషన్ (అమెరికా) 7. ది వాల్ట్ డిస్నీ (అమెరికా) 8. మౌటాయ్ (చైనా)
9. టీఎస్‌ఎంసీ సెమీ కండక్టర్స్ (తైవాన్) 10. ఐహెచ్‌సీ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)