లాభాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు.. విభజన తర్వాత ట్రేడింగ్‌లో దూకుడు
విభజన తర్వాత కూడా రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేరు తగ్గడం లేదు. ఆర్ఐఎల్ తన వ్యాపార ఆర్థిక సేవల విభాగమైన రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విభజించిన విషయం తెలిసిందే. తర్వాత రిలయన్స్ షేరు ఫ్రీ ట్రేడింగ్‌ను ముగించుకొని రూ.2,580 వద్ద మార్కెట్లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ట్రేడింగ్ ఉదయం 10గంటలకు ప్రారంభమైంది. ఉదయం 10.11 సమయంలో షేరు ధర 1.22 శాతం లాభంతో రూ.31.45 పెరిగి రూ.2,611.45 వద్ద ట్రేడ్ కావడం విశేషం. ఒకానొక దశలో షేరు ధర అత్యధికంగా రూ.2,630 స్థాయికి చేరుకుంది. రిలయన్స్ షేరు బుధవారం ట్రేడింగ్‌లో బీఎస్‌ఈలో రూ.2,840 వద్ద ముగియగా.. ఇంట్రాడేలో రూ.2,855 వద్ద తాజా 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.
షేరు వాటాదారులు 36 లక్షలు మంది ఉండే అవకాశం
మొదట జేఎఫ్‌ఎస్‌ఎల్ షేరు స్థిర విలువ రూ.160-190 మధ్య ఉంటుందని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేశాయి. కానీ, అంచనాలను మించి ఈ షేరు విలువ రాణించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదార్లు తమ వద్ద ఉన్న ప్రతి షేరుకూ.. ఒక జేఎఫ్‌ఎస్‌ఎల్ షేరును పొందుతారు. అంటే 100 ఆర్‌ఐఎల్ షేర్లకు 100 జేఎఫ్‌ఎస్‌ఎల్ షేర్లు లభించనున్నాయి. జులై 20న రికార్డు తేదీగా నిర్ణయించారు. అప్పటికి రిలయన్స్ షేర్లు కలిగి ఉన్న వాళ్లకే మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను కలిగి ఉన్న వాటాదార్లు సుమారు 36 లక్షల మంది ఉండే అవకాశం ఉంది.