LOADING...
Gold Price : బంగారం కొనాలనుకునేవారికి ఊరట.. వరుసగా తగ్గుతున్న పసిడి ధరలు!
బంగారం కొనాలనుకునేవారికి ఊరట.. వరుసగా తగ్గుతున్న పసిడి ధరలు!

Gold Price : బంగారం కొనాలనుకునేవారికి ఊరట.. వరుసగా తగ్గుతున్న పసిడి ధరలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2026
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

పసిడి ప్రియులకు ఊరట కలిగించేలా బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,060 వద్ద ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,43,050 వద్ద కొనసాగింది. అదే సమయంలో 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,040గా నమోదైంది. ఇక శుక్రవారం ఉదయం బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది . గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,050కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.1,43,040 వద్ద ట్రేడ్ అవుతుండగా, 18 క్యారెట్ల బంగారం రూ.1,17,030 వద్ద కొనసాగుతోంది.

వివరాలు

వెండి ధరలు కూడా తగ్గుముఖం

బంగారం ధరలతో పాటు వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల నమోదైంది. గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల వెండి ధర రూ.28,500గా ఉండగా, కిలో వెండి రూ.2,85,000 వద్ద ట్రేడ్ అయింది. శుక్రవారం ఉదయం వెండి ధరలు కొద్దిగా తగ్గాయి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్‌లో 10 గ్రాముల వెండి ధర రూ.28,490గా ఉండగా, కిలో వెండి రూ.2,84,900 వద్ద ట్రేడ్ అవుతోంది.

వివరాలు

ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు)

హైదరాబాద్ - రూ.1,56,050 విజయవాడ - రూ.1,56,050 విశాఖపట్నం - రూ.1,56,050 ముంబై - రూ.1,56,050 బెంగళూరు - రూ.1,56,050 ఢిల్లీ - రూ.1,56,200 చెన్నై - రూ.1,58,170 సూరత్ - రూ.1,56,200 మధురై - రూ.1,58,170 కోయంబత్తూరు - రూ.1,58,170 బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదవడంతో కొనుగోలు దారుల్లో కొంత ఊరట కనిపిస్తోంది.

Advertisement