Amazon Sale: రిపబ్లిక్ డే సేల్ అలర్ట్.. అమెజాన్ ఆఫర్లు ఎప్పటినుంచంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరో భారీ సేల్‌కు రెడీ అయింది. ఇటీవల ఫ్లిప్‌కార్ట్ తన సేల్ తేదీలను ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు అమెజాన్ కూడా 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026'ను అధికారికంగా ప్రకటించింది. ఈ సేల్ జనవరి 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే పూర్తి స్థాయి డీల్స్, ఆఫర్ల వివరాలను త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది.
Details
జనవరి 17 నుంచి ప్రారంభం
గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, పీసీలు, గేమింగ్ కన్సోల్స్, స్మార్ట్ గ్లాసెస్, వాషింగ్ మెషిన్లు, ప్రొజెక్టర్లు, స్మార్ట్ టీవీలపై ప్రత్యేక ఆఫర్లు ఉండనున్నాయని సమాచారం. ఇదిలా ఉండగా, ఫ్లిప్‌కార్ట్ తన సేల్‌ను జనవరి 17 నుంచి ప్రారంభించనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లకు మాత్రం 24 గంటల ముందస్తు యాక్సెస్ కల్పించనుంది. ఈ నేపథ్యంలో పండగ సీజన్‌లో దేశంలోని రెండు అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థల మధ్య మరోసారి భారీ పోటీ నెలకొనే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.