Page Loader
ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతం: 18నెలల్లో ఇదే అత్యల్పం 
ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతం: 18నెలల్లో ఇదే అత్యల్పం

ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతం: 18నెలల్లో ఇదే అత్యల్పం 

వ్రాసిన వారు Stalin
May 12, 2023
06:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 4.7 శాతానికి పడిపోయింది. మార్చిలో 5.66 శాతం నమోదు కావడం గమనార్హం. అక్టోబర్ 2021 నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం ఇంత తక్కువ నమోదుకావడం ఇదే తొలిసారి. నవంబర్ 2021 నుంచి 5 శాతానికి దిగువకు పడిపోవడం కూడా ఇదే మొదటిసారి. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన డేటా ప్రకారం వినియోగదారుల ధరల సూచీ ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ట స్థాయి 4.7 శాతానికి తగ్గింది.

సీపీఐ

ఇక వడ్డీ రేట్ల పెంపుదలకు ఆర్‌బీఐ విరామం ప్రకటించినట్లేనా?

రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 2023లో 5.66 శాతం, ఫిబ్రవరి 2023లో 6.44 శాతంగా ఉంది. ఆహార ధరల తగ్గుదల కారణంగా ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. ఆహార ధరల ద్రవ్యోల్బణం మార్చిలో 4.79 శాతం నుంచి ఏప్రిల్‌లో 3.84 శాతానికి పడిపోయింది. ఏప్రిల్‌లో గ్రామీణ ద్రవ్యోల్బణం 4.68 శాతంగా ఉండగా, పట్టణ ద్రవ్యోల్బణం 4.85 శాతంగా ఉందని ఎన్ఎస్ఓ పేర్కొంది. బ్యాక్-టు-బ్యాక్ వడ్డీ రెట్ల పెంపు తర్వాత చివరి పాలసీ సమీక్షలో కీలక రేట్లను మార్చకుండా స్థిరంగా ఉంచిన సెంట్రల్ బ్యాంక్‌కు ఈ పరిణామం ఉపశమనే అనే చెప్పాలి. దీంతో ఆర్‌బీఐ ఈ ఏడాది మిగిలిన రేట్ల పెంపుదలకు విరామం ఇచ్చే అవకాశం ఉంది.