
Retail inflation: 8 ఏళ్ల కనిష్ఠ స్థాయికి దిగిన రిటైల్ ద్రవ్యోల్బణం.. కారణమిదే..!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్లలో కనిష్ట స్థాయికి చేరింది. జులైలో ఇది 1.55 శాతం గా నమోదు కావడం గమనార్హం. దీని ప్రధాన కారణంగా ఆహార పదార్థాల ధరల తగ్గుదలను గుర్తించారు. ఈ విషయాన్ని కేంద్ర గణాంక కార్యాలయం (NSO) మంగళవారం విడుదల చేసిన డేటా ద్వారా వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 2 నుంచి 6 శాతం మధ్య బ్యాండ్ కంటే ఈ రిటైల్ ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉండడం, గడిచిన ఆరేళ్లలో ఇది మొదటిసారి కావడం విశేషం.
Details
గతేడాది జులైలో 3.6శాతంగా నమోదు
వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 2.1 శాతంగా ఉండగా, గత ఏడాది జులైలో ఇది 3.6 శాతంగా నమోదు కావడం తో పోలిస్తే ప్రస్తుతం స్థాయి చాలా తక్కువగా ఉంది. 2017 జూన్‌లో 1.46 శాతం గా నమోదైన కనిష్ట ద్రవ్యోల్బణం తర్వాత ఇదే తక్కువ స్థాయి అని NSO పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణంలో ప్రధాన ప్రభావం చూపేది ఆహారపదార్థాల ధరలు. జులైలో ఆహారపదార్థాల ద్రవ్యోల్బణం -1.76 శాతంగా నమోదైంది. ఇందులో పప్పు, ధాన్యాలు, రవాణా, కమ్యూనికేషన్, కూరగాయలు, ధాన్యాలు, విద్యా వ్యయం, గుడ్లు, చక్కెర, మిఠాయిల ధరల తగ్గుదల ముఖ్యంగా ఉంటూ, ఇవి మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడంలో కీలక పాత్ర పోషించాయని NSO వివరించింది.