
GST collections: అక్టోబర్‌లో 13% పెరిగిన జీఎస్టీ వసూళ్లు@ రూ. 1.72 లక్షల కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
అక్టోబర్‌లో ప్రభుత్వ జీఎస్టీ వసూళ్లు 13% పెరిగి రూ. 1.72లక్షల కోట్లకు చేరాయి.
ఈ ఏడాది ఇప్పటి వరకు ఇది రెండో అత్యధిక జీఎస్టీ వసూళ్లు కావడం గమనార్హం.
రూ.1.5లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు రావడం ఇది వరుసగా 8వ సారి.
అంతకుముందు ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.87లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇదే ఇప్పటి వరకు అత్యధిక జీఎస్టీ వసూళ్లు అని ప్రభుత్వం గణాంకాలు చెబుతున్నాయి.
ఏప్రిల్‌లో దేశీయ లావాదేవీల ఆదాయంలో 13% వృద్ధి నమోదైంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటు స్థూల నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ. 1.66 లక్షల కోట్లుగా ఉంది. ఇది వార్షిక ప్రాతిపదికన 11శాతం వృద్ధి కావడం గమనార్హం.
జీఎస్టీ
అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి
సెంట్రల్ జీఎస్టీ: రూ. 30,062 కోట్లు
రాష్ట్ర జీఎస్టీ: రూ. 38,171 కోట్లు
ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ: రూ. 91,315 కోట్లు (వస్తువుల దిగుమతుల ద్వారా రూ. 42,127 కోట్లు కలిపి)
సెస్సు: రూ. 12,456 కోట్లు (వస్తువుల దిగుమతి ద్వారా రూ. 1,294 కోట్లు కలిపి)
మొదటి స్థానంలో మహారాష్ట్ర
అత్యధిక పన్ను వసూలు చేస్తున్న రాష్ట్రాల్లో 14% వార్షిక వృద్ధితో రూ.84,712 కోట్లు వసూలు చేసిన మహారాష్ట్ర మరోసారి నంబర్‌వన్‌గా నిలిచింది.
12% వార్షిక వృద్ధితో రూ.42,657 కోట్లు వసూలు చేసిన కర్ణాటక రెండో స్థానంలో ఉంది.
ఉత్తరప్రదేశ్ రూ.42,482 కోట్లు, తమిళనాడు రూ.37,476 కోట్లు, గుజరాత్ రూ.36,322 కోట్లు పన్ను వసూలు చేశాయి.