LOADING...
Solar Defence: రోబోలు, డ్రోన్లు, క్షిపణుల తయారీకి రూ.12,800 కోట్ల పెట్టుబడి.. సోలార్ డిఫెన్స్ భారీ ప్రణాళిక!
రోబోలు, డ్రోన్లు, క్షిపణుల తయారీకి రూ.12,800 కోట్ల పెట్టుబడి.. సోలార్ డిఫెన్స్ భారీ ప్రణాళిక!

Solar Defence: రోబోలు, డ్రోన్లు, క్షిపణుల తయారీకి రూ.12,800 కోట్ల పెట్టుబడి.. సోలార్ డిఫెన్స్ భారీ ప్రణాళిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 08, 2026
02:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

డీప్‌టెక్ ప్రాజెక్టుల అభివృద్ధికి సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ భారీ పెట్టుబడులను ప్రకటించింది. సంస్థ రూ.12,800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ పెట్టుబడులతో ముఖ్యంగా వివిధ పరిమాణాలు, రోబోట్లు, అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (UAVs) తయారీపై దృష్టి పెట్టనుంది. అలాగే దీర్ఘ శ్రేణి క్షిపణుల తయారీకి కూడా నిధులు వినియోగించనుంది. సోలార్ గ్రూప్ చైర్మన్ సత్యనారాయణ నువాల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుతున్న యుద్ధ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ పెట్టుబడులు పెట్టుతున్నట్లు తెలిపారు.

Details

నాగ్‌పూర్‌లో కొత్త తయారీ కేంద్రం

ఈ ప్రాజెక్టు భాగంగా నాగ్‌పూర్‌లో కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రంలో ప్రతేడాది వివిధ పరిమాణాలు, అవసరాలకు అనుగుణంగా 10,000 డ్రోన్లు తయారు చేసే సామర్థ్యం ఉంటుంది. అదేవిధంగా ఏడాదికి సుమారు 1,000 రోబోట్లు కూడా ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో తయారయ్యే తొలి రోబోట్ ప్రోటోటైప్ వచ్చే ఒక ఏడాదిలో సిద్ధమయ్యే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది. ఈ పెట్టుబడులను దశలవారీగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో ప్రారంభించి, మొత్తం ప్రణాళికను వచ్చే పది సంవత్సరాల వ్యవధిలో అమలు చేయనున్నారు. ఇది మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా ప్రాజెక్ట్, త్రస్ట్ పాలసీ కింద అమలవుతుంది.

Details

భారతదేశంలో తొలి AI ఆధారిత ఇండస్ట్రీ 5.0 తయారీ కేంద్రం

ఈ కొత్త యూనిట్‌ను భారతదేశంలో తొలి AIఆధారిత ఇండస్ట్రీ 5.0తయారీ ఎకోసిస్టమ్‌గా అభివృద్ధి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఆధునిక రోబోటిక్స్, ఇంటెలిజెంట్ ఆటోమేషన్, మానవ కేంద్రిత, స్థిరమైన తయారీ విధానాలను సమన్వయం చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా వాణిజ్య అవసరాలతో పాటు రక్షణ రంగానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ భాగాలు, పరికరాలు, వ్యూహాత్మక ఉత్పత్తుల రూపకల్పన, అభివృద్ధి, తయారీ చేపట్టనున్నారు. మొదటి దశలో ముఖ్యంగా అధునాతన AIఆధారిత UAVలు, ముఖ్యంగా మిడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్(MALE)డ్రోన్లు అభివృద్ధి, తయారీపై ప్రధాన దృష్టి సారించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత రక్షణ సాంకేతిక రంగంలో కీలక పురోగతి సాధించడంతో పాటు దేశీయ తయారీ సామర్థ్యాలు మరింత బలపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement