
గూగుల్ పే వినియోగదారుల ఖాతాలోకి రూ.88వేలు జమ; మీరూ చెక్ చేసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ పే(Google Pay) వినియోగదారులు రివార్డ్‌ల కోసం వర్చువల్ కూపన్‌లను స్క్రాచ్ చేయడం అలవాటుగా మారింది. ఆ కూపన్ల వల్ల డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్‌లు, ఇతర ప్రయోజనాలను పొందుతుంటారు.
అయితే కొన్ని రోజుల క్రితం కంపెనీ ఉద్యోగులు చేసిన చిన్న పొరపాటు కారణంగా ఏకంగా నగదునే గూగుల్ పే వ్యాలెట్‌లో జమ చేసి వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఏకకంగా రూ.88వేలను వ్యాలెట్‌లోకి గూగుల్ యాడ్ చేసింది.
అయితే ఇది ఒకరికో, ఇద్దరికో కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది వినియోగదారులకు నగదును గూగుల్ జమ చేయడం గమనార్హం.
గూగుల్
కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్న క్రమంలో జరిగిన పొరపాటు
గూగూల్ తన చెల్లింపు యాప్‌లో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నప్పుడు జీ పే వినియోగదారులు యాదృచ్ఛికంగా రూ. 800 నుండి రూ. 80,000 వరకు వర్చువల్ నగదును అందుకున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
వాస్తవానికి ట్రయల్‌లో పాల్గొన్న ఉద్యోగులకు చెల్లింపులను పంపడానికి బదులుగా, పిక్సల్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు పొరపాటున వర్చువల్ నగదు బదిలీ అయినట్లు గూగూల్ పేర్కొంది.
అనూహ్యంగా వచ్చిన పడిన నగదను చూసిన వినియోగదారులు ఆశ్చర్యానికి గురికాగా, వినియోగించుకున్న సొమ్మును గూగుల్ తిరిగి లాగేసుకుంటుందని తెలిసి బోరుమంటున్నారు.