LOADING...
Sarvam AI: యూనికార్న్ క్లబ్‌లోకి సర్వమ్ AI.. రూ.1.5 బిలియన్ విలువతో 234 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ
రూ.1.5 బిలియన్ విలువతో 234 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ

Sarvam AI: యూనికార్న్ క్లబ్‌లోకి సర్వమ్ AI.. రూ.1.5 బిలియన్ విలువతో 234 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 15, 2026
08:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరుకు చెందిన కృత్రిమ మేధ (AI) స్టార్టప్ సర్వమ్ AI భారతదేశంలో మరో యూనికార్న్ కంపెనీగా అవతరించింది. తాజాగా నిర్వహించిన సిరీస్-బీ ఫండింగ్ రౌండ్‌లో 234 మిలియన్ డాలర్లు సమీకరించగా, కంపెనీ విలువ 1.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ నిధులను తదుపరి తరం AI మోడళ్ల అభివృద్ధితో పాటు సంస్థలు, ప్రభుత్వ అవసరాలకు భారీ స్థాయి కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల విస్తరణకు వినియోగించనుంది.

వివరాలు 

హెచ్‌సీఎల్‌టెక్ నేతృత్వంలో పెట్టుబడులు

ఈ ఫండింగ్ రౌండ్‌కు హెచ్‌సీఎల్‌టెక్ నాయకత్వం వహించింది. సంస్థ 150 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టగా, బెస్సెమర్ వెంచర్ పార్ట్‌నర్స్ కూడా భాగస్వామ్యమైంది. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన ఖోస్లా వెంచర్స్, పీక్ XV పార్ట్‌నర్స్ కూడా ఈ రౌండ్‌లో నిధులు సమకూర్చాయి. 2023లో వివేక్ రాఘవన్, ప్రత్యూష్ కుమార్ స్థాపించిన సర్వమ్ AI భారతీయ భాషలు,దేశీయ అవసరాలకు అనుగుణంగా AI మోడళ్లు, ఇన్‌ఫరెన్స్ ప్లాట్‌ఫామ్‌లు, ఎంటర్‌ప్రైజ్ AI ఉత్పత్తులను అభివృద్ధి చేస్తోంది.

వివరాలు 

రోజుకు 20 లక్షలకు పైగా AI సంభాషణలు

సర్వమ్ AI ఇటీవల సర్వమ్ 105B, సర్వమ్ 30B, సర్వమ్ విజన్ వంటి పలు స్వదేశీ ఫౌండేషన్ మోడళ్లను విడుదల చేసింది. కంపెనీ కన్వర్సేషనల్ AI ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రస్తుతం రోజుకు 20 లక్షలకు పైగా ఇంటరాక్షన్‌లు జరుగుతున్నాయి. అలాగే ఇన్‌ఫరెన్స్ ప్లాట్‌ఫామ్ ప్రతిరోజూ కోటి API కాల్స్‌ను ప్రాసెస్ చేస్తోంది. గత కొద్ది నెలలుగా ఈ సేవల వినియోగం గణనీయంగా పెరిగినట్లు కంపెనీ తెలిపింది.

Advertisement

వివరాలు 

పలు రంగాల్లో సర్వమ్ AI సేవలు

సర్వమ్ AI సాంకేతికత ప్రస్తుతం బ్యాంకింగ్, బీమా, ప్రభుత్వ, రక్షణ రంగాల్లో ఉపయోగంలో ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన డేటా సేకరణ కార్యక్రమాల్లో కంపెనీ రూపొందించిన బహుభాషా వాయిస్ ప్లాట్‌ఫామ్ ద్వారా 1.7 కోట్ల మంది రైతులతో సంభాషించింది. అలాగే AI ఆధారిత సేవల ద్వారా దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మంది బీమా వినియోగదారుల పాలసీల పునరుద్ధరణ ప్రక్రియను సులభతరం చేసింది.

Advertisement

వివరాలు 

భవిష్యత్ లక్ష్యం ఇదే..

తాజా పెట్టుబడులతో అధునాతన AI ఫ్రంట్ియర్ మోడళ్లపై పరిశోధనలను మరింత వేగవంతం చేయడంతో పాటు, పెద్ద ఎత్తున కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించాలని సర్వమ్ AI లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ, కార్పొరేట్ రంగాలకు AI సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై సంస్థ దృష్టి సారిస్తోంది.

Advertisement