Page Loader
SBI digital rupee: ఎస్‌బీఐ కస్టమర్ల కోసం కొత్త సదుపాయం.. ఇక యూపీఐ ద్వారా 'డిజిటల్ రూపాయి'ని పంపొచ్చు
ఎస్‌బీఐ కస్టమర్ల కోసం కొత్త సదుపాయం.. ఇక యూపీఐ ద్వారా 'డిజిటల్ రూపాయి'ని పంపొచ్చు

SBI digital rupee: ఎస్‌బీఐ కస్టమర్ల కోసం కొత్త సదుపాయం.. ఇక యూపీఐ ద్వారా 'డిజిటల్ రూపాయి'ని పంపొచ్చు

వ్రాసిన వారు Stalin
Sep 04, 2023
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

వినియోగదారుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)డిజిటల్ రూపీ విధానంలో నూతన సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) అని పిలువబడే డిజిటల్ రూపాయి (ఈ- రూపీ) పేమెంట్‌ను యూపీఐ ఇంటర్‌పెరాబిలిటీ ద్వారా చేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. కొత్త విధానంతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా డిజిటల్ రూపాయిలను ఒకరికొకరు పంపించుకోవచ్చు అన్నమాట. ఈ ఫీచర్‌ను 'ఈ- రూపాయి బై ఎస్‌బీఐ' యాప్‌ ద్వారా పొందవచ్చు. ఇప్పటికే 'ఈ రూపీ' సదుపాయాన్ని హెచ్‌డీఎఫ్‌సీ అమలు చేస్తోంది. ఆ తర్వాత కెనరా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌ సైతం దీని అమలు చేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ఆ ఖాతాలో చేరింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యూపీఐ ద్వారా డిజిటల్ రూపాయి లావాదేవీలు