SBI: ఎస్‌బీఐ సూపర్ స్కీమ్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.11 వేల గ్యారంటీ!
ఈ వార్తాకథనం ఏంటి
మీరు సురక్షితమైన పెట్టుబడి మార్గాలను వెతుకుతున్నారా? ఒకేసారి కొంత పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టి, ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం పొందాలనుకుంటే పోస్టాఫీస్ పథకాలు, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న SBI Annuity Deposit Scheme కూడా మంచి ఎంపికగా నిలుస్తుంది. ఈ పథకం అంటే ఏమిటి? ఈ స్కీమ్‌లో మీరు ఒకేసారి మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. ఆ తర్వాత ప్రతి నెలా మీకు అసలు + వడ్డీ కలిపి చెల్లింపులు వస్తాయి. అంటే మెచ్యూరిటీ వరకు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నెలనెలా ఆదాయం పొందే వీలుంటుంది.
వివరాలు
ముఖ్య లక్షణాలు
పూర్తిగా సురక్షితమైన పథకం - SBI ద్వారా అందుబాటులో ఉంటుంది నెలనెలా స్థిరమైన ఆదాయం కనీస పెట్టుబడి రూ.1,000 మాత్రమే గరిష్ఠ పరిమితి లేదు కాలపరిమితి: కనీసం 3 సంవత్సరాలు - గరిష్ఠంగా 10 సంవత్సరాలు డిపాజిట్‌పై 75% వరకు లోన్ సౌకర్యం వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి? ఈ స్కీమ్‌కు ప్రత్యేకంగా వడ్డీ రేట్లు ఉండవు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) రేట్లే దీనికి వర్తిస్తాయి. టెన్యూర్‌ను బట్టి వడ్డీ మారుతుంది. అయితే, రాబడి మాత్రం స్థిరంగా ఉంటుంది.
వివరాలు
రాబడి విధానం
సాధారణ FDలతో పోలిస్తే, ఈ పథకంలో మెచ్యూరిటీకి ఒకేసారి మొత్తం కాకుండా ప్రతి నెలా చెల్లింపులు అందుతాయి. ముఖ్యంగా రిటైర్డ్ వ్యక్తులు లేదా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఇది ఎంతో అనుకూలం. ఉదాహరణగా చూడాలి అంటే... మీరు రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టి 10 సంవత్సరాల కాలపరిమితి ఎంచుకుంటే: సాధారణ కస్టమర్లకు (సుమారు 6.05% వడ్డీతో) నెలకు సుమారు రూ.11,354 10 సంవత్సరాల్లో మొత్తం సుమారు రూ.13.62 లక్షలు
వివరాలు
సీనియర్ సిటిజెన్స్‌కు (సుమారు 7.05% వడ్డీతో)
నెలకు సుమారు రూ.11,630 మొత్తం సుమారు రూ.13.90 లక్షలు ఈ పథకం అన్ని SBI బ్రాంచ్‌లలో అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక SBI వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. మొత్తంగా చూస్తే, SBI Annuity Deposit Scheme అనేది ఎలాంటి రిస్క్ లేకుండా నెలనెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి సరైన పెట్టుబడి మార్గంగా చెప్పవచ్చు. ఒకేసారి డబ్బు పెట్టి, దీర్ఘకాలం పాటు ఆర్థిక భద్రతను పొందే అవకాశం ఇందులో ఉంది.