NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Schengen visa: స్కెంజెన్ దేశాల వీసాల ఫీజులపై జూన్ నుంచి భారీ వడ్డన 
    తదుపరి వార్తా కథనం
    Schengen visa: స్కెంజెన్ దేశాల వీసాల ఫీజులపై జూన్ నుంచి భారీ వడ్డన 
    స్కెంజెన్ దేశాల వీసాల ఫీజులపై జూన్ నుంచి భారీ వడ్డన

    Schengen visa: స్కెంజెన్ దేశాల వీసాల ఫీజులపై జూన్ నుంచి భారీ వడ్డన 

    వ్రాసిన వారు Stalin
    May 21, 2024
    03:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యూరోపియన్ యూనియన్ దేశాల వీసాల ఫీజులు పెంచుతున్నట్లు ఆ సమాఖ్య కమిషన్ ప్రకటించింది.

    కొద్ది రోజుల క్రితమే అమెరికా హెచ్ 1బీ వీసాల గడువుపై ఆంక్షలు విధించిన సంగతి విదితమే.

    ఈ తరుణంలో యూరోపియన్ కమిషన్ వీసాల ఫీజును 12 %పెంచుతున్నట్లు తెలిపింది.దీనిని సాల్వేనియా విదేశీ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

    వీసాల ఫీజు పెద్దలకైతే €80 నుంచి €90 యూరో కరెన్సీ ప్రకారం పెంచారు. దీనికి తోడు యూరప్ దేశాల్లో నివసిస్తున్నపరాయి దేశస్ధులు €135 నుంచి €180 యూరో కరెన్సీని వీసాల ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది.

    టైపు C వీసాల ఫీజును 12 %పెంచుతున్నట్లు సాల్వేనియా విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది జూన్ 11 2024 నుంచి అమలులోకి రానుంది.

    Details 

    ద్రవ్యోల్బణం, ఉద్యోగుల వ్యయాలు వీసాల ఫీజులతో భరిస్తాం 

    యూరోపియన్ కమిషన్ వీసాల ఫీజును పెంచాలనే నిర్ణయం గత ఏడాది డిసెంబర్ లో తీసుకున్నారు.

    ప్రతి మూడేళ్లకు యూరోపియన్ వీసాల ఫీజును సమీక్షించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.

    పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఉద్యోగుల వ్యయాలు పెరిగినందున పెంచక తప్పలేదని యూరోపియన్ కమిషన్ సమర్ధించుకుంది.

    గతంలో వీసాల ఫీజును ఓ సారి పెంచారు. ఫిబ్రవరి 2020లో €60 యూరో కరెన్సీ నుంచి €80కి పెంచారు.

    కాగా స్కెంజెన్ ప్రాంతం అంటే 25 EU సభ్య దేశాలతో కూడిన 29 దేశాలను కలిగి ఉంది.

    ఈ వడ్డనపై టర్కీ దేశస్ధులు అసంతృప్తిగా ఉన్నారు. టర్కీ వాసులు యూరోపియన్ దేశాల్లో ఎక్కడికైనా వెళ్లి వచ్చే స్వేచ్ఛను ఇప్పటి వరకు కలిగి ఉన్నారు.

    Details 

    స్కెంజెన్ దేశాలు సురక్షితం అంటున్న పలు దేశాల యువత 

    2023లో, స్కెంజెన్ దేశాలు ఇప్పటి వరకు 10.3 మిలియన్లకు పైగా స్వల్ప వ్యవధి వీసా దరఖాస్తులను అందుకుంది.

    ఇది 2022 నుండి 37% పెరిగింది, అయినప్పటికీ 2019 గరిష్టంగా 17 మిలియన్ దరఖాస్తులు ఉన్నాయి.

    అమెరికా హెచ్ 1బీ వీసాల తలనొప్పి కంటే యూరోపియన్ దేశాల్లో స్ధిర పడటం మంచిదని పలు దేశాల యువత ఆలోచనగా కనిపిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వీసాలు

    తాజా

    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్
    India-Pakistan Tension: భారత్, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌.. 24 ఎయిర్‌పోర్టుల క్లోజ్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    Stock Market:భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్
    Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్

    వీసాలు

    భారతీయులకు గుడ్‌న్యూస్: వీసాలను వేగంగా జారీ చేసేందుకు సిబ్బంది నియామకాలు రెట్టింపు చేస్తున్న అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    వీసాల జారీలో భారత్ మా మొదటి ప్రాధాన్యత: అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    భారతీయులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం చేయనున్న రష్యా రష్యా
    ఉద్యోగ కోతల్లో తన టీంతో పాటు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోల్పోయిన భారతీయ టెక్కీ మైక్రోసాఫ్ట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025