LOADING...
IPO: మూడు కంపెనీల ఐపీఓలకు సెబీ ఆమోదం.. జియో ఐపీఓకు ఆరు బ్యాంకుల మద్దతు
జియో ఐపీఓకు ఆరు బ్యాంకుల మద్దతు

IPO: మూడు కంపెనీల ఐపీఓలకు సెబీ ఆమోదం.. జియో ఐపీఓకు ఆరు బ్యాంకుల మద్దతు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 17, 2026
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ట్రావెల్‌ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న ట్రావెల్‌స్టాక్‌ టెక్‌, లక్ష్య కోచింగ్‌ కేంద్రాలను నడుపుతున్న లెర్న్‌ఫ్లుయెన్స్‌ ఎడ్యుకేషన్‌, అలాగే టీ కేఫ్‌ చైన్‌గా పేరొందిన టీ పోస్ట్‌ కంపెనీల ఐపీఓ ప్రతిపాదనలకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ట్రావెల్‌స్టాక్‌ టెక్‌ తన ఐపీఓలో భాగంగా రూ.250 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేయనుంది. అదేవిధంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు కలిపి మొత్తం 2,68,52,969 షేర్లను విక్రయించేందుకు సిద్ధమయ్యారు.

vivaralu

త్వరలో ఐపీఓలకు సంబంధించి ధరల శ్రేణి, ఇష్యూ తేదీల వివరాలు 

లెర్న్‌ఫ్లుయెన్స్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ రూ.246 కోట్లకు సమానమైన తాజా షేర్లను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఓఎఫ్‌ఎస్‌ ద్వారా ప్రమోటర్లు సుమారు 40 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. టీ పోస్ట్‌ కూడా తన ఐపీఓలో 1.43 కోట్ల కొత్త షేర్లను జారీ చేయనుంది. అలాగే ఓఎఫ్‌ఎస్‌ కింద అదే పరిమాణంలో, అంటే 1.43 కోట్ల వరకు షేర్లను ప్రమోటర్లు విక్రయించే అవకాశం ఉంది. ఈ మూడు కంపెనీల ఐపీఓలకు సంబంధించి ధరల శ్రేణి, ఇష్యూ తేదీల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

వివరాలు 

జియో ఐపీఓకు ఆరు బ్యాంకుల మద్దతు

తన టెలికాం విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓ ప్రక్రియలో భాగంగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) పలు అంతర్జాతీయ, దేశీయ బ్యాంకులతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌, గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ గ్రూప్‌తో పాటు మొత్తం ఆరు బ్యాంకులు ఈ ప్రక్రియలో సహకరిస్తున్నాయి. జియో ఐపీఓ ద్వారా సుమారు 4 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.37,000 కోట్లు) సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

వివరాలు 

జియో సంస్థ విలువ దాదాపు 170 బిలియన్‌ డాలర్లు

ఈ వ్యవహారానికి సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం, సిటీ గ్రూప్‌, జేఎం ఫైనాన్షియల్‌, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, మోర్గాన్‌ స్టాన్లీ వంటి సంస్థలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. బ్యాంకర్ల అంచనాల ప్రకారం జియో సంస్థ విలువ దాదాపు 170 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.15.64 లక్షల కోట్లు)గా ఉంది. సవరించిన ఐపీఓ నిబంధనల ప్రకారం కనీసం 2.5 శాతం ఈక్విటీని విక్రయిస్తే సరిపోతుంది. ఈ లెక్కన సుమారు 4.3 బిలియన్‌ డాలర్ల వరకు నిధులు సమీకరించే అవకాశం ఉంది. ముందస్తు ప్రక్రియలు పూర్తయిన తరువాత సంస్థ సెబీకి తుది ముసాయిదా పత్రాలను సమర్పించనుంది. అప్పటికి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Advertisement

వివరాలు 

అన్‌అకాడమీని సొంతం చేసుకోనున్న అప్‌గ్రేడ్

రోనీ స్క్రూవాలా స్థాపించిన ఎడ్‌టెక్‌ దిగ్గజం అప్‌గ్రేడ్‌, స్వాప్‌ ఒప్పందం ద్వారా అన్‌అకాడమీలో 100 శాతం వాటాను పొందేందుకు సిద్ధమైంది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అన్‌అకాడమీ సహ వ్యవస్థాపకుడు గౌరవ్‌ ముంజాల్‌ కంపెనీ సీఈఓగా కొనసాగుతారు. ఏటీఎంఏ ఛైర్మన్‌గా మళ్లీ అరుణ్‌ ఆటోమోటివ్‌ టైర్‌ తయారీ సంస్థల సంఘమైన ఏటీఎంఏకు ఎంఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ వైస్‌ ఛైర్మన్‌, ఎండీ అరుణ్‌ మామెన్‌ను మరోసారి ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. అలాగే బ్రిడ్జ్‌స్టోన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ రాజర్షి మొయిత్రాను వైస్‌ ఛైర్మన్‌గా ఎంపిక చేశారు.

Advertisement