Loading...
Gautam Adani: గౌతమ్‌ అదానీకి సెబీ నుంచి ఊరట.. రూ.1.48 కోట్లతో కేసు క్లోజ్
గౌతమ్‌ అదానీకి సెబీ నుంచి ఊరట.. రూ.1.48 కోట్లతో కేసు క్లోజ్

Gautam Adani: గౌతమ్‌ అదానీకి సెబీ నుంచి ఊరట.. రూ.1.48 కోట్లతో కేసు క్లోజ్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 29, 2026
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీకి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఊరట లభించింది. కనీస పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఆరోపణలపై అదానీ గ్రూప్‌నకు చెందిన నాలుగు కంపెనీలపై కొనసాగుతున్న చర్యలను సెబీ ముగించింది. ఈ కేసును పరిష్కరించుకునేందుకు గౌతమ్‌ అదానీ సహా మొత్తం 18 మంది రూ.1.48 కోట్ల సెటిల్‌మెంట్‌ మొత్తాన్ని చెల్లించారు. 2020లో ఫిర్యాదులు అదానీ గ్రూప్‌లోని కొన్ని కంపెనీలు కనీస పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ నిబంధనలను పాటించడం లేదంటూ 2020 జూన్‌, జులై నెలల్లో సెబీకి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై సెబీ తొలుత ప్రాథమిక విచారణ చేపట్టింది. అనంతరం అదే ఏడాది అక్టోబర్‌ 23న పూర్తిస్థాయి దర్యాప్తును ప్రారంభించింది.

వివరాలు 

2024లో షోకాజ్‌ నోటీసులు

దర్యాప్తు పూర్తయిన తర్వాత 2024 సెప్టెంబర్‌ 27న సెబీ సంబంధిత వ్యక్తులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

అనంతరం 2025 మార్చి 3న మరో అనుబంధ నోటీసును కూడా ఇచ్చింది.

కనీస పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఆరోపణలపైనే ఈ నోటీసులు జారీ అయ్యాయి.

ఈ వ్యవహారంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పవర్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీలు ఉన్నాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌ ప్రస్తుతం అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ పేరుతో కొనసాగుతోంది.

వివరాలు 

రూ.1.48 కోట్లతో సెటిల్‌మెంట్

కేసును పరిష్కరించుకునేందుకు సంబంధిత వ్యక్తులు సెబీకి ప్రతిపాదన పంపారు.

ఆరోపణలను అంగీకరించకుండానే, వాటిని తిరస్కరించకుండానే కేసును సెటిల్‌ చేసుకునేందుకు వారు అంగీకరించారు.

ఈ క్రమంలో మొత్తం రూ.1.48 కోట్లను సెటిల్‌మెంట్‌ మొత్తంగా చెల్లించారు.

దీంతో గౌతమ్‌ అదానీ, నాలుగు కంపెనీలు, మరో 13 మందిపై కొనసాగుతున్న చర్యలను ముగిస్తున్నట్లు సెబీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో కనీస పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ నిబంధనలకు సంబంధించిన ఈ వ్యవహారం సెబీ వద్ద ముగిసింది.

ADVERTISEMENT