SEBI: మార్కెట్ సైబర్ భద్రత కోసం 'సైబర్ సురక్ష' పోర్టల్ ప్రారంభించిన సెబీ
ఈ వార్తాకథనం ఏంటి
మార్కెట్‌లో సైబర్ భద్రతను మరింత పెంచే ఉద్దేశంతో భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (సెబీ) కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. దీనికి 'సైబర్ సురక్ష' అని పేరు పెట్టింది. సెక్యూరిటీస్ రంగానికి సంబంధించిన సైబర్ భద్రత సమాచారం, తాజా వివరాలను ఒకేచోట అందించేందుకు ఈ వేదికను ఏర్పాటు చేశారు. సెక్యూరిటీస్ మార్కెట్‌లోని సంస్థలు, ఇతర భాగస్వాములు సైబర్ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సులభంగా పొందేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. సైబర్ భద్రతకు సంబంధించిన కీలక పరిజ్ఞానాన్ని పంచుకోవడంతో పాటు అవసరమైన సమాచారాన్ని ఒకేచోట అందించే కేంద్రంగా ఇది పనిచేస్తుందని సెబీ ఓ ప్రకటనలో తెలిపింది.
వివరాలు
తాజా సైబర్ భద్రత సర్క్యులర్లు నేరుగా అందుబాటులోకి
'సైబర్ సురక్ష' పోర్టల్‌లో తాజా సైబర్ భద్రత సర్క్యులర్లు, సాఫ్ట్‌వేర్ లోపాలకు సంబంధించిన హెచ్చరికలు, సైబర్ ఘటనలకు సంబంధించిన వివరాలను నేరుగా పొందే అవకాశం ఉంటుంది.
దీంతో మార్కెట్‌లోని అన్ని భాగస్వాములు సైబర్ భద్రత రంగంలో వస్తున్న తాజా మార్పులు, పరిణామాలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే వీలు కలుగుతుంది.
భారత సెక్యూరిటీస్ మార్కెట్‌లో భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేయడంలో భాగంగానే ఈ పోర్టల్‌ను సెబీ ప్రారంభించింది.
సైబర్ ముప్పులను గుర్తించడం, వాటిపై అవగాహన పెంచడం, మార్కెట్ భాగస్వాములకు తాజా సమాచారాన్ని అందించడం ద్వారా భద్రతను మెరుగుపరచడమే దీని ఉద్దేశంగా సెబీ పేర్కొంది.