Page Loader
Sensex : 75000 దాటిన సెన్సెక్స్,నిఫ్టీ సరికొత్త రికార్డు
Sensex : 75000 దాటిన సెన్సెక్స్,నిఫ్టీ సరికొత్త రికార్డు

Sensex : 75000 దాటిన సెన్సెక్స్,నిఫ్టీ సరికొత్త రికార్డు

వ్రాసిన వారు Stalin
Apr 09, 2024
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్ రోజురోజుకు తన గత రికార్డులను బద్దలు కొడుతోంది. మంగళవారం స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఉదయం ట్రేడింగ్‌లో, సెన్సెక్స్ 75,124.28 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇది దాని ఆల్ టైమ్ హై లెవెల్, కాగా సోమవారం 74,742.50 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం రికార్డు సృష్టించిన తర్వాత, సెన్సెక్స్‌లో స్వల్ప క్షీణత కనిపించినప్పటికీ, వెంటనే మార్కెట్ కోలుకుని 9.55 గంటలకు 300 పాయింట్ల లాభంతో 75,045.52 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

Details 

నిఫ్టీలు సరికొత్త రికార్డులు సృష్టించాయి 

అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ 'నిఫ్టీ 50' కూడా మంగళవారం సరికొత్త రికార్డు సృష్టించింది. 22,765.10 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. కాగా సోమవారం 22,666.30 పాయింట్ల వద్ద ముగిసింది. దీని అప్‌వర్డ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు 47 పాయింట్ల పెరుగుదలతో 22,713.35 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌-30 సూచీలో ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, విప్రో, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. రిలయన్స్‌, టైటన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Details 

ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ వృద్ధి సంకేతాలు 

భారత స్టాక్ మార్కెట్ల పెరుగుదలకు అనేక అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. వడ్డీరేట్ల తగ్గింపునకు సంబంధించి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చేసిన ప్రకటనలు మార్కెట్‌కు ఊరటనిచ్చాయి. దేశీయ మార్కెట్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతున్నాయి.ఇది మార్కెట్ పెరగడానికి దోహదపడుతోంది. మరోవైపు కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలు రావడం మొదలయ్యాయి. దీంతోపాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర తగ్గింది. దీంతో స్టాక్ మార్కెట్ లాభపడుతోంది.