నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 299.48, నిఫ్టీ 72.65 పాయింట్ల క్షీణత
భారత స్టాక్ మార్కెట్‌లు సోమవారం నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 299.48 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 72.65 పాయింట్లు క్షీణించింది. సెషన్ మూగిసే సరికి సెన్సెక్స్ 0.45% క్షీణించి 66,384.78 పాయింట్ల వద్ద, నిఫ్టీ 0.37% క్షీణించి 19,672.35 పాయింట్ల వద్ద స్థిరపడింది. గ్లోబల్ మార్కెట్లు నష్టాలతో ముగియడం,అలాగే రిలయన్స్ బ్యాంకు, ఐటీసీ షేర్ల అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలతో ముగిశాయి. ఈ వారంలో ప్రకటించబోయే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన నిర్ణయం కోసం ట్రేడర్లు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారుల సంకోచాలు కూడా ఈక్విటీ మార్కెట్లపై ప్రతి కూల ప్రభావం చూపాయి. అలాగే ముడి చమురు ధరలు స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణంగా నిలిచాయి.
ఐటీసీ షేర్లలో 3.87 శాతం, రిలయన్స్ షేర్లలో 1.92 శాతం క్షీణత
30-స్టాక్ సెన్సెక్స్‌లో సోమవారం సెషన్‌ను 18 కంపెనీలు లాభాలతో ముంగించగా, 50-స్టాక్ ఇండెక్స్ నిఫ్టీలో 25 స్టాక్స్ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.01 శాతం వరకు లాభపడ్డాయి. ఇందులో ఐటీసీ, కోటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా, రిలయన్స్ వంటి బెల్‌వెదర్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. వీటిలో అత్యధికంగా ఐటీసీ షేర్లు 3.87 శాతం నష్టంతో, రిలయన్స్ 1.92 శాతం క్షీణతను నమోదు చేశాయి. ఆసియాలోని మిగతా చోట్ల ఈక్విటీ మార్కెట్లు నిక్కీ 1.23 శాతం లాభపడగా, హాంగ్ సెంగ్, షాంఘై కాంపోజిట్ వరుసగా 2.13 శాతం, 0.11 శాతం క్షీణించాయి.