LOADING...
Stock market: ఊగిసలాట మధ్య నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్ 500 పాయింట్లు పతనం.. 23,700 దిగువకు నిఫ్టీ
సెన్సెక్స్ 500 పాయింట్లు పతనం.. 23,700 దిగువకు నిఫ్టీ

Stock market: ఊగిసలాట మధ్య నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్ 500 పాయింట్లు పతనం.. 23,700 దిగువకు నిఫ్టీ

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2026
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం భారీ ఊగిసలాట కనిపించింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నానికి నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 471 పాయింట్లు ఎగబాకి 75,870 స్థాయిని తాకగా.. నిఫ్టీ కూడా 23,839 వరకు చేరింది. అయితే మధ్యాహ్నం తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల సమయానికి సెన్సెక్స్ 237 పాయింట్లు పడిపోయి 75,161 వద్ద ట్రేడ్ అవగా.. నిఫ్టీ 72 పాయింట్లు నష్టపోయి 23,616 స్థాయికి చేరింది. మెటల్‌, రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంకులు, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడిచమురు ధరలు

స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్ సూచీలు కూడా స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. గత రెండు రోజులుగా మార్కెట్లు భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గురువారం సెన్సెక్స్ దాదాపు 790 పాయింట్లు, నిఫ్టీ 277 పాయింట్లు లాభపడిన సంగతి తెలిసిందే. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మళ్లీ పెరగడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 109 డాలర్లను దాటింది. భారత్ అధికంగా చమురు దిగుమతులపై ఆధారపడటంతో క్రూడ్ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

వివరాలు 

డాలర్‌తో పోలిస్తే భారీగా బలహీనపడిన రూపాయి 

దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 పెంచినా.. అది మార్కెట్ అంచనాలకు తక్కువగానే ఉండటంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు పడిపోయాయి. బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఇండియన్ ఆయిల్ షేర్లు 2 నుంచి 3 శాతం వరకు నష్టపోయాయి. రూపాయి విలువ కూడా డాలర్‌తో పోలిస్తే భారీగా బలహీనపడింది. డాలర్‌కు రూ.96 వద్ద కొత్త కనిష్ట స్థాయికి చేరుకోవడం మార్కెట్లపై మరింత ఒత్తిడిని తెచ్చింది. పెరుగుతున్న చమురు ధరలు, బలపడుతున్న డాలర్‌, పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయని ఫారెక్స్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా బలహీన సంకేతాలే వచ్చాయి. జపాన్ నిక్కీ, హాంకాంగ్ హ్యాంగ్‌సెంగ్‌, దక్షిణ కొరియా కోస్పీ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

Advertisement

వివరాలు 

మార్కెట్లను కలవరపెడుతున్న ఇరాన్‌కు ఉద్రిక్తతలు

అమెరికా ఫ్యూచర్స్ కూడా బలహీనంగా కనిపించడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఇదే సమయంలో ఇరాన్‌కు సంబంధించిన భౌగోళిక ఉద్రిక్తతలు కూడా మార్కెట్లను కలవరపెడుతున్నాయి. టెక్నికల్‌గా చూస్తే నిఫ్టీకి 23,900-24,000 స్థాయిలో రెసిస్టెన్స్ ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 23,600 దిగువకు వెళ్తే మరికొంతకాలం కన్సాలిడేషన్ కొనసాగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

Advertisement