Loading...
Stock market: స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock market: స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 28, 2026
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం దాదాపు స్థిరంగానే ముగిసినా, చివరికి స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలతో పాటు, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల సూచీలపై ఒత్తిడి ఏర్పడింది. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఈ ప్రభావంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 69.86 పాయింట్లు క్షీణించి 76,765.92 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10.60 పాయింట్లు తగ్గి 23,985.35 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 95.84గా నమోదైంది.

వివరాలు

లాభాల్లో నిలిచిన షేర్లు ఇవే..

సెన్సెక్స్‌-30లో టీసీఎస్‌, ఎటర్నల్‌, టెక్‌ మహీంద్రా, టైటాన్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు లాభాల్లో నిలిచాయి.

మరోవైపు హిందుస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌), బీఈఎల్‌, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి.

అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ చమురు ధర బ్యారెల్‌కు 86.18 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్స్‌ ధర 4,021.89 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ADVERTISEMENT