Loading...
Stock Market: చమురు ధరల పెరుగుదలతో మార్కెట్‌కు షాక్‌.. సెన్సెక్స్‌ 455 పాయింట్లు పతనం
చమురు ధరల పెరుగుదలతో మార్కెట్‌కు షాక్‌.. సెన్సెక్స్‌ 455 పాయింట్లు పతనం

Stock Market: చమురు ధరల పెరుగుదలతో మార్కెట్‌కు షాక్‌.. సెన్సెక్స్‌ 455 పాయింట్లు పతనం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2026
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారాంతంలో నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరగడం, ఫైనాన్షియల్‌ రంగానికి చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ప్రధాన సూచీలు దిగజారాయి. దీంతో రోజంతా ఒత్తిడిలో కొనసాగిన మార్కెట్‌ చివరికి నష్టాల వద్దే ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 455.59 పాయింట్లు కోల్పోయి 78,499.17 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 65.35 పాయింట్లు తగ్గి 24,570.65 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.20 వద్ద కొనసాగింది.

వివరాలు 

బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 83 డాలర్లు 

సెన్సెక్స్‌ 30 షేర్లలో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ట్రెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి.

మరోవైపు టీసీఎస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా, బీఈఎల్‌ షేర్లు లాభాల్లో నిలిచి మార్కెట్‌కు కొంత మద్దతు అందించాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 83 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో బంగారం ధర ఔన్సుకు 4,300 డాలర్లకు పైగా కొనసాగుతోంది.

ADVERTISEMENT