Loading...
Sensex Today: లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు ...సెన్సెక్స్ 550 ప్లస్..
లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు ...సెన్సెక్స్ 550 ప్లస్..

Sensex Today: లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు ...సెన్సెక్స్ 550 ప్లస్..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
01:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టాక్ మార్కెట్లు అక్టోబర్ 30న మళ్లీ లాభాల బాట పట్టాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు.. ఆ తర్వాత క్రమంగా పుంజుకుని గ్రీన్‌లోకి వచ్చాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో కొనుగోళ్లు పెరగడం మార్కెట్లకు ఊతమిచ్చింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సెన్సెక్స్ 555.33 పాయింట్లు (దాదాపు 0.75 శాతం) పెరిగి 74,706.37 వద్ద ట్రేడయింది. మరోవైపు నిఫ్టీ కూడా 166.6 పాయింట్లు (దాదాపు 0.73 శాతం) లాభపడి 23,103.35 వద్ద కొనసాగింది.

వివరాలు 

ఐటీ సూచీ 1.7 శాతం పెరుగుదల

ఐటీ రంగానికి చెందిన షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో ఐటీ సూచీ 1.7 శాతం దూసుకెళ్లింది.

ఆసియా మార్కెట్లలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత కంపెనీల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి.

ఏఐ రంగంలో కంపెనీలు భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ.. అందుకు తగిన ఆదాయం, లాభాలు వస్తాయా? అనే సందేహాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి.

దీంతో గ్లోబల్ ఏఐ కంపెనీల షేర్లలో అమ్మకాలు కనిపించాయి. అయితే ఈ పరిస్థితి భారత ఐటీ కంపెనీలకు కలిసొస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఖరీదైన ఏఐ టెక్నాలజీపై సొంతంగా భారీగా పెట్టుబడులు పెట్టడం కంటే.. ఖర్చులు తగ్గించుకోవడం, ఇతర సంస్థలకు పనులను అప్పగించడం(అవుట్‌సోర్సింగ్) వైపు పలు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.

దీంతో భారత ఐటీ సంస్థలకు అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

వివరాలు 

మార్కెట్లు పెరగడానికి దోహదపడిన ఇతర కారణాలు

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి కాగ్నిజెంట్ ప్రకటించిన స్థిరమైన ఆర్థిక ఫలితాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌కు బలాన్నిచ్చాయి.

ఆ ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉండటం మరో సానుకూల అంశంగా మారింది.

అక్టోబర్ నెలలో ఇప్పటివరకు నిఫ్టీ 1.6 శాతం, సెన్సెక్స్ 2.5 శాతం చొప్పున లాభపడ్డాయి.

కీలక కంపెనీలు ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉండటంతో.. తక్కువ విలువ వద్ద లభిస్తున్న షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు.

ఈ కొనుగోళ్లు కూడా మార్కెట్ల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

మార్కెట్లు పెరగడానికి దోహదపడిన ఇతర కారణాలు

మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని తీసుకున్న నిర్ణయం కూడా మార్కెట్లలో సానుకూల వాతావరణానికి కారణమైంది.

ఈ పరిణామాలపై జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ స్పందించారు.

కొన్ని కీలక కంపెనీల ఆర్థిక ఫలితాలు నిలకడగా ఉండటం, దేశీయంగా డిమాండ్ స్థిరంగా కొనసాగడం మార్కెట్లకు మద్దతుగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT