Loading...
Stock Market: లాభాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు.. 500 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్
లాభాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు.. 500 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్

Stock Market: లాభాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు.. 500 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2026
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం,విదేశీ మదుపరుల పెట్టుబడులు కొనసాగడం దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చాయి. వీటికి తోడు ఎఫ్‌ఎంసీజీ,బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 500 పాయింట్లకు పైగా పెరిగింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25,300 పాయింట్ల మార్కుకు చేరువైంది. సోమవారం ఉదయం సెన్సెక్స్‌ క్రితం ముగింపు 81,592.45 పాయింట్లతో పోలిస్తే లాభాల్లో 81,810.98 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. రోజంతా కొనుగోళ్ల మద్దతుతో ముందుకు సాగిన సూచీ.. ఇంట్రాడేలో 82,311.65 పాయింట్ల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. చివరకు 512.34 పాయింట్ల లాభంతో 82,104.79 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 146.80 పాయింట్లు పెరిగి 25,291.10 వద్ద ముగిసింది.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం

ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.92గా నమోదైంది.

సెన్సెక్స్‌-30లోని షేర్లను పరిశీలిస్తే.. ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎటర్నల్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు ప్రధానంగా లాభాలను నమోదు చేశాయి.

మరోవైపు టాటా స్టీల్‌, మారుతీ సుజుకీ, ఇండిగో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, సన్‌ ఫార్మా, అదానీ పోర్ట్స్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

దీంతో ఆయా స్టాక్స్‌ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి.

బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 93.92 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు పసిడి ధర కూడా అంతర్జాతీయ విపణిలో ఔన్సుకు 3,862.81 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ADVERTISEMENT