NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 23,200 ఎగువన నిఫ్టీ 
    తదుపరి వార్తా కథనం
    Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 23,200 ఎగువన నిఫ్టీ 
    స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 23,200 ఎగువన నిఫ్టీ

    Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 23,200 ఎగువన నిఫ్టీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 23, 2025
    04:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన మిశ్రమ సంకేతాల మధ్య ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు, ఆటో, ఐటీ కంపెనీల షేర్ల మద్దతుతో మెరుగుపడ్డాయి.

    అల్ట్రాటెక్ సిమెంట్, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా షేర్లు సూచీలకు బలంగా నిలిచాయి.

    ఫలితంగా సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 115 పాయింట్ల లాభం సాధించగా, నిఫ్టీ 50 పాయింట్లు పెరిగింది.

    సెన్సెక్స్ ఉదయం 76,414.52 (మునుపటి ముగింపు 76,404.99) వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది.

    ప్రారంభంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొన్న ఈ సూచీ, ఇంట్రాడేలో 76,202.12 వద్ద కనిష్ఠాన్ని తాకింది.

    ఐటీ,ఆటో రంగాల్లో మదుపరుల కొనుగోళ్లతో, సూచీ ఇంట్రాడేలో 76,743.54 వద్ద గరిష్ఠాన్ని చేరుకుంది.

    వివరాలు 

     బంగారం ధర ఔన్సుకు 2,755 డాలర్లు 

    చివరికి 115 పాయింట్ల లాభంతో 76,520.38 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 23,205.35 వద్ద స్థిరపడింది.

    సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, జొమాటో, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, టాటా మోటార్స్, టైటాన్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి.

    అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్ షేర్లు నష్టపోయాయి.

    అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 78.97 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ధర ఔన్సుకు 2,755 డాలర్ల వద్ద ఉంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.86.47 వద్ద ముగిసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం!  స్మార్ట్ ఫోన్
    Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల! ఓటిటి
    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర

    స్టాక్ మార్కెట్

    Stock market:నష్టాలలో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీ బిజినెస్
    Stock Market: నష్టాల్లో మొదలైన స్టాక్‌ మార్కెట్లు.. ఈ ఏడాదిలో చివరి ట్రేడింగ్‌..  బిజినెస్
    Stock market: సెన్సెక్స్‌ 109 పాయింట్లు డౌన్‌.. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  బిజినెస్
    Stock Market: న్యూ ఇయర్ తొలి రోజు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సూచీలు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025