Loading...
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన నిఫ్టీ.. 373 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ఫ్లాట్‌గా ముగిసిన నిఫ్టీ.. 373 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన నిఫ్టీ.. 373 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2026
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయన్న సంకేతాలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కాస్త దిగిరావడం ఇన్వెస్టర్లలో సానుకూల భావనను పెంచింది. దీనికి తోడు పీఎస్‌యూ, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో బలమైన కొనుగోళ్లు నమోదవడంతో మార్కెట్‌కు మద్దతు లభించింది. రోజంతా ఊగిసలాట మధ్య సాగిన ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 373.76 పాయింట్లు ఎగబాకి 78,954.76 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మాత్రం స్వల్పంగా 11.35 పాయింట్లు పెరిగి 24,636.00 వద్ద స్థిరపడింది.

వివరాలు 

బంగారం ఔన్సు ధర 4,269.48 డాలర్లు 

విదేశీ మారక మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.23 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్‌లోని 30 ప్రధాన షేర్లలో రిలయన్స్‌, ఎస్‌బీఐ, బీఈఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎటర్నల్‌, టైటాన్‌ షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి.

మరోవైపు పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌, ఇండిగో, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 79.90 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 4,269.48 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ADVERTISEMENT