Stock market : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 566, నిఫ్టీ 130 పాయింట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐటీ, ప్రైవేటు బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో మంగళవారం నాటి షాక్ నుంచి రీబౌన్స్ అయ్యాయి.
రోజంతా స్వల్ప మార్పులతో కదలాడిన సూచీలకు చివర్లో కొనుగోలుల మద్దతుతో లాభాలు చేరాయి.
ఈ పరిణామంతో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడి, నిఫ్టీ 23,100 పాయింట్లను దాటి స్థిరపడింది.
వివరాలు
నిఫ్టీ 130.70 పాయింట్ల లాభంతో 23,155.35 వద్ద స్థిరపడింది
సెన్సెక్స్ 76,114.42 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 75,838.36) లాభాలతో ప్రారంభమైంది.
ఉదయంనుండి స్వల్ప లాభాలతోనే కదలాడిన సూచీ, ఒక దశలో స్వల్ప నష్టాలను కూడా నమోదు చేసింది.
అయితే, చివరి గంటలో భారీ కొనుగోలులతో సెన్సెక్స్ 566.63 పాయింట్ల లాభంతో 76,404.99 వద్ద ముగిసింది.
నిఫ్టీ 130.70 పాయింట్ల లాభంతో 23,155.35 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 25 పైసలు పెరిగి 86.33 వద్ద ముగిసింది.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 79.64 డాలర్లు
సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎన్టీపీసీ షేర్లు నష్టాలను ఎదుర్కొన్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 79.64 డాలర్ల వద్ద కొనసాగగా, బంగారం ఔన్సు ధర 2771 డాలర్లను చేరుకుంది.