
Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా..?
ఈ వార్తాకథనం ఏంటి
ఇటివలి కాలంలో ఊపందుకున్న బంగారం, వెండి ధరలకు తాజాగా తగ్గుదలలు నమోదవుతున్నాయి. లక్ష రూపాయలకుపైగా పరుగులు పెట్టిన పసిడి ధర ఇప్పుడు కొంత మేరకు వెనక్కి తగ్గింది. ధరలు రికార్డు స్థాయిల నుంచి పడిపోతుండటంతో బంగారం కొనుగోలుదారులకు ఇది కొంతవరకూ రిలీఫ్ కలిగించే పరిణామంగా చెప్పవచ్చు. జూన్ 26న దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.98,950కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.90,700గా ఉంది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.74,210గా నమోదైంది.వెండి ధర కిలోకు రూ.1,07,900గా ఉంది. తులం బంగారం పైకి 300రూపాయలకుపైనే తగ్గినట్లుగా ఉంది. గత రెండు మూడు రోజుల్లోనూ వెయ్యి రూపాయలకుపైగా ధరలు తగ్గినట్టు గమనించవచ్చు.
వివరాలు
ధరలు తగ్గడానికి గల కారణాలు
ఈ విషయంపై హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ మాట్లాడుతూ, బుధవారం నాడు మార్కెట్ మిశ్రమ సంకేతాల మధ్య స్వల్పంగా తగ్గుదలతో బంగారం దిగువ స్థాయిలో కొనసాగిందన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ విరమణ ప్రకటించడంతో భౌగోళిక, రాజకీయ పరిస్థితులు స్థిరపడటంతో సురక్షిత పెట్టుబడులపై డిమాండ్ తగ్గిందని తెలిపారు. ఈ ప్రభావంతో బంగారం ధరలు రెండు వారాల కనిష్టానికి చేరినట్టు చెప్పారు.
వివరాలు
సీజనల్ ప్రభావాలు, గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు
పెళ్లిళ్ల సీజన్‌కు అనుగుణంగా బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. అంతర్జాతీయ వాణిజ్య వివాదాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశీయ బులియన్ మార్కెట్లో ధరలు తగ్గుతూ ఉండటం కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తోంది. అయితే, ఫ్యూచర్స్ మార్కెట్లో మాత్రం కొంతమేర పెరుగుదల కనిపిస్తోంది. అంతేకాదు, విదేశీ మార్కెట్లలో కూడా ప్రస్తుతం చురుకుదనం కనిపిస్తోంది. భవిష్యత్తులోనూ బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని నిపుణుల అభిప్రాయం.
వివరాలు
ప్రాంతాలవారీగా ధరల వివరాలు
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,950గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.90,700గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.99,100 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,850గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,950 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.90,700కు విక్రయించబడుతోంది. హైదరాబాద్ విషయానికొస్తే, అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,950గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.90,700గా ఉంది.