LOADING...
Silver Rates: సిల్వర్‌ ధర సరికొత్త రికార్డు.. త్వరలో 3 లక్షల మార్క్‌ చేరే అవకాశం!
సిల్వర్‌ ధర సరికొత్త రికార్డు.. త్వరలో 3 లక్షల మార్క్‌ చేరే అవకాశం!

Silver Rates: సిల్వర్‌ ధర సరికొత్త రికార్డు.. త్వరలో 3 లక్షల మార్క్‌ చేరే అవకాశం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 27, 2025
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

వామ్మో.. సిల్వర్‌ మార్కెట్‌ అదరగొడుతోంది! మునుపెన్నడూ చూడని విధంగా వెండి ధర ఇప్పుడు సునామీ సృష్టిస్తోంది. కొద్దిరోజుల క్రితం వరకు కిలో వెండి ధర లక్ష రూపాయల రేంజ్‌లో ఉండేది. కానీ ఈ మధ్య పరిస్థితి మార్చిపోయింది. ఏ కారణంతోనో తెలియకపోయినా, ధర రెండు లక్షల రూపాయలకు దూసుకెళ్లింది. వెండి మరల రికార్డ్ సృష్టించేందుకు పరుగులు పెడుతోంది. ఈ వారంలోనే దాదాపు రూ.50,000 పెరగడం, హైదరాబాద్‌లో ఒక్కరోజే రూ.20,000 వృద్ధి కలిగి కిలో వెండి ధర రూ.2,74,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తే త్వరలోనే 3 లక్షల మార్కు చేరడం ఖాయం అనిపిస్తోంది. కొనుగోలుదారులు ఈ వేగాన్ని చూస్తే వామ్మో అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Details

కిలో వెండి ధర రూ.11,000 పెరిగింది

బులియన్ మార్కెట్‌లో కూడా వెండి ధర ఘర్షణ కొనసాగుతోంది. ఈరోజు కిలో వెండి ధర రూ.11,000 పెరిగి సరికొత్త రికార్డ్ స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ప్రత్యేకంగా హైదరాబాద్‌, చెన్నై బులియన్ మార్కెట్‌లో ఈ రోజు రూ.20,000 పెరుగుదలతో కిలో వెండి ధర రూ.2,74,000 చేరింది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతా బులియన్ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.2,51,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక బంగారం ధరలు కూడా దూసుకెళ్తున్నాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,41,220 వద్ద ట్రేడ్ అవుతోంది.

Advertisement