Gold And Silver: ఒక్కసారిగా కుప్పకూలిన వెండి.. ఏకంగా రూ.6వేలు తగ్గింపు!
ఈ వార్తాకథనం ఏంటి
గత వారం రోజులుగా భారీగా పెరుగిన బంగారం, వెండి ధరలు ఈరోజు (డిసెంబర్ 13న) ఒక్కసారిగా తగ్గు ముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా రేట్లు పెరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అయితే వీకెండ్ లో షాపింగ్ చేయాలని అనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు తాజా రేట్లను పరిశీలించడం చాలా ముఖ్యం. ఇక, 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 తగ్గి 1,33,910గా ఉండగా.. ఇక, 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.250 తగ్గి, 1,22,750 వద్ద కొనసాగుతుంది.
Details
24 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర
హైదరాదాబాద్ లో రూ.13వేల 391 విజయవాడలో రూ.13వేల 391 విశాఖలో రూ.13వేల 391 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర.. హైదరాదాబాద్ లో రూ.12వేల 275 విజయవాడలో రూ.12వేల 275 విశాఖలో రూ.12వేల 275 అయితే, బంగారం ధరలతో పాటు మరొ పక్క వెండి రేట్లు పతనం అవుతున్నాయి. ఇవాళ (డిసెంబర్ 13న) కిలో వెండి రూ.6 వేలు తగ్గటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి 1 లక్ష 98 వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి ధర 198 రూపాయలకు విక్రయాలు జరుపున్నారు.