Page Loader
Cibil Score: ఆకర్షణీయమైన CIBIL స్కోర్ కోసం ఆరు సూత్రాలు 
ఆకర్షణీయమైన CIBIL స్కోర్ కోసం ఆరు సూత్రాలు

Cibil Score: ఆకర్షణీయమైన CIBIL స్కోర్ కోసం ఆరు సూత్రాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2024
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

మూడంకెల క్రెడిట్‌ స్కోర్‌ ఫైనాన్స్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. మన దేశంలో వ్యక్తులు,కంపెనీల రుణ చరిత్రను ఆధారంగా చేసుకొని సిబిల్‌(క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో)అందించిన సమాచారం ఆధారంగా రుణదాతలు నిర్ణయాలు తీసుకుంటారు. సిబిల్‌ 300 నుంచి 900 వరకు క్రెడిట్‌ స్కోర్లను కేటాయిస్తుంది.ఈ స్కోర్‌ వ్యక్తులు లేదా సంస్థల రుణ అర్హతను నిర్ధారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అధిక క్రెడిట్‌ స్కోర్‌: 750 పైగా స్కోర్‌ ఉన్నవారు తక్కువ వడ్డీ రేటు వద్ద రుణాలు సులభంగా పొందవచ్చు. క్రెడిట్‌ కార్డులు, వ్యక్తిగత రుణాలు తదితరాలు వీరికి అందుబాటులో ఉంటాయి. తక్కువ స్కోర్‌: 685 కంటే తక్కువ స్కోర్‌ ఉన్నవారికి రుణాలు పొందడంలో కష్టాలు తలెత్తుతాయి. వడ్డీ రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.

వివరాలు 

క్రెడిట్‌ స్కోర్‌ను మెరుగుపరచడంలో ముఖ్యమైన మార్గాలు 

1. సకాలంలో చెల్లింపులు: తీసుకున్న రుణాల EMIలను నిర్ణీత తేదీలలో చెల్లించడం ముఖ్యం. ఆలస్యం మీ స్కోర్‌ను తగ్గించడమే కాకుండా డిఫాల్టర్‌గా గుర్తింపును తెస్తుంది, దీని ప్రభావం భవిష్యత్తులో రుణ సదుపాయాలపై ఉంటుంది. 2. రుణ పరిమితిలో ఉండడం: రుణాన్ని సాధ్యమైనంత పరిమితంగా వాడటం ఉత్తమం. నిపుణుల ప్రకారం, అందుబాటులో ఉన్న రుణ పరిమితిలో 30%లోపు మాత్రమే వినియోగించుకోవాలి. ఈ విధానం మీ స్కోర్‌ను మెరుగుపరచుతుంది. 3. అనవసర రుణ అన్వేషణ వద్దు: తరచూ రుణాల కోసం వాకబు చేయడం మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న సంకేతాలను సిబిల్‌కు అందిస్తుంది. ఇది స్కోర్‌ను తగ్గించే అవకాశం ఉంటుంది.

వివరాలు 

క్రెడిట్‌ స్కోర్‌ను మెరుగుపరచడంలో ముఖ్యమైన మార్గాలు 

4. పొరపాట్లను సరిచేయడం:సకాలంలో చెల్లించిన రుణాల సమాచారాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. పొరపాట్లు ఉంటే సంబంధిత బ్యాంకులను సంప్రదించి వాటిని సరిచేయించాలి. 5. గ్యారంటీలకు దూరంగా ఉండడం:ఇతరుల రుణాలకు పూచికత్తు వహించడం వల్ల వారు డిఫాల్ట్‌ అయితే భారం మీపై పడుతుంది. ఇది మీ స్కోర్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. 6. సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డుల ఉపయోగం:సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డులు తక్కువ క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటాయి. డిపాజిట్‌ ఆధారంగా ఇచ్చే ఈ కార్డులు,చెల్లింపులు క్రమంగా చేస్తే స్కోర్‌ను మెరుగుపరుస్తాయి. తేలికపాటి పరిశీలనతో మెరుగైన స్కోర్‌ ఆన్‌లైన్‌లో సులభంగా క్రెడిట్‌ స్కోర్‌ తనిఖీ చేసే సదుపాయం ఉంది. తరచూ స్కోర్‌ను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవడం ఆర్థిక భద్రతకు సహాయపడుతుంది.