Page Loader
OYO వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వివాహానికి హాజరైన సాఫ్ట్‌బ్యాంక్ CEO, Paytm బాస్
సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్‌ మసయోషి సన్ పాదాలకు నమస్కరిస్తున్న రితేశ్ అగర్వాల్‌-గీతాన్షా దంపతులు

OYO వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వివాహానికి హాజరైన సాఫ్ట్‌బ్యాంక్ CEO, Paytm బాస్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 08, 2023
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓయో హోటళ్ల సీఈఓ రితేశ్‌ అగర్వాల్‌ వివాహం గీతాన్షా సూద్‌తో దిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌ హోటల్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. ఈ వివాహ రిసెప్షన్ కి జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ మసయోషి సన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా రితేష్‌ అగర్వాల్‌ దంపతులు సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్‌ మసయోషి సన్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. దేశంలోని అత్యంత పిన్న వయస్కులైన బిలియనీర్‌లలో ఒకరైన మిస్టర్ అగర్వాల్ 2013లో 19 ఏళ్ల వయసులో OYOని స్థాపించారు. సాఫ్ట్‌బ్యాంక్, జపనీస్ ఓయో కంపెనీ కి అతిపెద్ద పెట్టుబడిదారు. రితేశ్ అగర్వాల్‌-గీతాన్షా దంపతుల వివాహానికి పేటీఎం సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ, లెన్స్‌ కార్ట్‌ సీఈవో పియోష్‌ బన్సాల్‌ వంటి కార్పొరేట్‌ దిగ్గజాలు హాజరయ్యారు.

విజయ్‌ శేఖర్‌ శర్మ

మసయోషి పర్యటనపై విజయ్‌ శేఖర్‌ శర్మ ట్వీట్‌

మసయోషి పర్యటనపై విజయ్‌ శేఖర్‌ శర్మ ట్వీట్‌ చేశారు. ఈ రోజు వెలకట్టలేని ఆనందం. మస నవ్వుతూ, సంతోషంగా ఉన్న ఈ ఆనంద సమయాల్లో భారత పర్యటన చేయడం..దేశీయ స్టార్టప్‌లపై అతనికి ఉన్న నమ్మకం, సపోర్ట్‌కు కృతజ్ఞతలు అంటూ మసయోషితో దిగిన ఫోటోల్ని ట్వీట్‌ చేశారు. ఇక కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ కూడా వివాహానికి హాజరై రితేశ్ అగర్వాల్‌-గీతాన్షా దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వారితో దిగిన ఫోటోలను ట్వీట్ చేశారు. ఢిల్లీలో తన తల్లి, కాబోయే భార్యతో కలిసి మోదీ వద్దకు వెళ్లిన రితేశ్‌.. ప్రధానికి పెళ్లి ఆహ్వానపత్రిక అందజేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆ ఫోటోలను రితేష్‌ అగర్వాల్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్విట్టర్ ద్వారా ఫోటోలను షేర్ చేసిన జల్‌శక్తిశాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మసయోషి పర్యటనపై విజయ్‌ శేఖర్‌ శర్మ ట్వీట్‌