SpaceX: AIకి పవర్ బ్యాకప్‌గా టెస్లా మెగాప్యాక్‌లు.. స్పేస్-X భారీ పెట్టుబడి
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్-X టెస్లా తయారు చేసే మెగాప్యాక్ బ్యాటరీ నిల్వ వ్యవస్థల కొనుగోలుపై భారీగా పెట్టుబడి పెట్టింది. కంపెనీ విడుదల చేసిన తాజా త్రైమాసిక ఆర్థిక నివేదిక ప్రకారం,రెండో త్రైమాసికం (Q2)లోనే మెగాప్యాక్‌ల కొనుగోలుకు 295 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం పెట్టుబడి 329 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ భారీ కొనుగోలు ఎలాన్ మస్క్‌కు చెందిన సంస్థల మధ్య ఉన్న సన్నిహిత వ్యాపార సంబంధాలను మరోసారి స్పష్టంచేసింది. స్పేస్‌ఎక్స్‌కు సీఈవోగా, అతిపెద్ద వాటాదారుగా ఉన్న మస్క్.. టెస్లాకు కూడా నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
వివరాలు
xAI డేటా సెంటర్లకు మెగాప్యాక్‌ల వినియోగం
స్పేస్‌ఎక్స్ కొనుగోలు చేసిన మెగాప్యాక్‌లు ప్రధానంగా xAI డేటా సెంటర్లలో వినియోగిస్తున్నట్లు సమాచారం.
స్పేస్‌ఎక్స్‌తో విలీనానికి ముందే xAI తన డేటా సెంటర్ల కోసం 430 మిలియన్ డాలర్ల విలువైన మెగాప్యాక్‌లను కొనుగోలు చేసింది.
2026 తొలి త్రైమాసికంలో (Q1) మాత్రమే xAI ఈ పరికరాల కొనుగోలుకు 34 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
దీంతో మస్క్ సంస్థల AI ప్రాజెక్టులకు బ్యాటరీ నిల్వ వ్యవస్థలు ఎంత కీలకంగా మారాయో స్పష్టమవుతోంది.
వివరాలు
సైబర్‌ట్రక్‌లపైనా భారీ పెట్టుబడి
మెగాప్యాక్‌లతో పాటు టెస్లా తయారు చేసే సైబర్‌ట్రక్ వాహనాల కొనుగోలులో కూడా స్పేస్‌ఎక్స్ భారీగా పెట్టుబడి పెట్టింది.
నియంత్రణ సంస్థలకు సమర్పించిన పత్రాల ప్రకారం, 2025 డిసెంబర్ నాటికి తయారీ సంస్థ సూచించిన ధర ప్రకారం 131 మిలియన్ డాలర్ల విలువైన సైబర్‌ట్రక్‌లను కంపెనీ కొనుగోలు చేసింది.
మస్క్‌కు చెందిన సంస్థలు ఒకదానికొకటి ఉత్పత్తులు, సేవలను వినియోగించుకుంటూ తమ వ్యాపార లక్ష్యాలను మరింత వేగంగా సాధించేందుకు ముందుకు సాగుతున్నాయని ఈ కొనుగోళ్లు సూచిస్తున్నాయి.
వివరాలు
AI కార్యకలాపాలకు మెగాప్యాక్‌లే కీలకం
xAI డేటా సెంటర్లు ప్రధానంగా సహజ వాయువు (నేచురల్ గ్యాస్) ఆధారంగా విద్యుత్‌ను వినియోగిస్తున్నప్పటికీ,మెగాప్యాక్ వంటి భారీ బ్యాటరీ నిల్వ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
విద్యుత్ అంతరాయం ఏర్పడితే క్షణంలోనే బ్యాకప్ పవర్ అందించడంతో పాటు,అవసరమైన సమయంలో GPUలకు అదనపు విద్యుత్‌ను సరఫరా చేస్తాయి.
AI డేటా సెంటర్లలో విద్యుత్ వినియోగం ఎప్పుడూ ఒకేలా ఉండదు. AI మోడళ్ల శిక్షణ, ఇన్‌ఫరెన్స్ పనుల ఆధారంగా విద్యుత్ అవసరం మారుతూ ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక విద్యుత్ సంస్థలపై అధిక భారం పడకుండా, జనరేటర్లపై ఒత్తిడి తగ్గేలా మెగాప్యాక్‌లు విద్యుత్ డిమాండ్‌ను సమతుల్యం చేస్తాయి.
దీంతో నిర్వహణ ఖర్చులు తగ్గడమే కాకుండా, AI సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు కూడా ఇవి కీలకంగా మారుతున్నాయి.