LOADING...
SIP: స్టెప్‌-అప్‌ SIP అంటే ఏమిటి?.. ఇది ఎవరికి అనుకూలం?
స్టెప్‌-అప్‌ SIP అంటే ఏమిటి?.. ఇది ఎవరికి అనుకూలం?

SIP: స్టెప్‌-అప్‌ SIP అంటే ఏమిటి?.. ఇది ఎవరికి అనుకూలం?

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 12, 2025
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడిని (SIP) ఉపయోగించి సంపదను సమకూర్చుకోవడం అందరికీ తెలిసిన విషయం. అయితే, సాదారణ SIP మాత్రమే చేస్తే, మీరు ఆశించిన వేగంతో ధనవంతులు అయ్యే అవకాశం తక్కువ. కానీ, Step-Up SIP ద్వారా, మీ ఆదాయం పెరుగుతున్న కొద్దీ పెట్టుబడిని కూడా పెంచి, కోట్ల రూపాయల సంపదను సృష్టించుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా తెలుసుకుందాం..

వివరాలు 

Step-Up SIP అంటే ఏమిటి? 

సాధారణ SIPలో, మీరు ఒక నిర్ణీత మొత్తాన్ని (ఉదాహరణకు నెలకు ₹5,000) ఎంచుకుని, కొన్ని సంవత్సరాల పాటు ప్రతి నెలా అదే మొత్తాన్ని పెట్టుబడిగా మలిచి వెళ్తారు. కానీ Step-Up SIPలో, మీరు ప్రతి ఏడాది, మీ ఆదాయం పెరుగుదలకి అనుగుణంగా, SIP మొత్తాన్ని కొంత శాతం పెంచుతూ వెళ్తారు (ఉదాహరణకు 10%). ఇలా పెట్టుబడిని పెంచడం ద్వారా భవిష్యత్తు అవసరాలకు సరిపడే సంపదను సమకూర్చవచ్చు.

వివరాలు 

లాభం ఎలా ఉంటుంది? 

సాధారణ సిప్, స్టెప్‌-అప్‌ సిప్‌ మధ్య తేడాను ఒక ఉదాహరణతో గమనిద్దాం. నెలకు ₹5,000 SIP 15 సంవత్సరాలు = మొత్తం ₹9,00,000 చెల్లింపు. వార్షిక సగటు రాబడి 12% అనుకుంటే, చివరగా సుమారు ₹24,00,000 వస్తుంది. అదే SIP Step-Up (ప్రతి ఏడాది 10% పెంపు) చేస్తే, మొత్తం చెల్లింపు ₹19,00,000, చివరగా ₹41,37,000 వస్తుంది. కోట్లు సాధ్యమే.. కాబట్టి, Step-Up SIP ద్వారా కోట్ల రూపాయల సంపద సృష్టించడం సాధ్యం.

Advertisement

వివరాలు 

ఉదాహరణకు 

రవి నెలకు ₹10,000 SIPతో ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి ప్రారంభించాడు, వార్షిక రాబడి 13% అనుకుంటే: అప్పుడు.. 16 ఏళ్లలో: మొత్తం పెట్టుబడి ₹43,13,968; రాబడి ₹62,58,822; మొత్తం ₹1,05,72,790 21 ఏళ్లలో: మొత్తం ₹76,80,300; రాబడి ₹1,63,56,706; మొత్తం ₹2,40,37,006 30 ఏళ్లలో: మొత్తం ₹1,97,39,283; రాబడి ₹7,29,15,507; మొత్తం ₹9,26,54,790 ఒక సంవత్సరం కుదించితే, ₹10.69 కోట్ల సంపద కూడా సాధ్యమని అంచనా.

Advertisement

వివరాలు 

జాగ్రత్తగా ఉండాలి.. 

Step-Up SIP శక్తివంతమైనది అయినప్పటికీ, చాలా ఎక్కువ (20-30%) పెంపు లక్ష్యంగా పెట్టకండి. ఆదాయం పెరగకపోతే SIP భారం అయ్యే అవకాశం ఉంది. మార్కెట్ త్రేడింగ్ హెచ్చుతగ్గులను పట్టించుకోవద్దు; దీర్ఘకాలంలోనే చక్రవడ్డీ ప్రభావం ఉంటుంది. SIP ప్రారంభం చిన్న మొత్తంతో చేయడం మంచిది; దాన్ని క్రమం తప్పకుండా పెంచుతూ వెళ్ళాలి.

వివరాలు 

ఎవరికి అనుకూలం: 

కొత్తగా ఉద్యోగంలో చేరినవారికి: మొదటి SIP చిన్నదైనప్పటికీ, ఆదాయం పెరుగుతున్న కొద్దీ Step-Up చేయవచ్చు. ఆలస్యంగా SIP ప్రారంభించినవారికి (40 ఏళ్లు+) Step-Up SIP ఉపయోగకరం, ఎందుకంటే సమయం తక్కువ. ఉదాహరణ: 45 ఏళ్ల వ్యక్తి నెలకు ₹10,000 SIP 15 సంవత్సరాలు = ₹88,82,196 (13% రాబడి) అదే Step-Up SIP (15% వార్షిక పెంపు) = ₹1,20,77,377 ముఖ్య సూచనలు: గణాంకాలు అంచనాలే; పెట్టుబడి ప్రారంభించే ముందు సొంత పరిశీలన చేయాలి. మ్యూచువల్ ఫండ్లలో నష్టభయం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి.

Advertisement