LOADING...
Stock market: ఐటీ, ఆటో షేర్ల మద్దతుతో లాభాల్లోకి స్టాక్‌ సూచీలు
ఐటీ, ఆటో షేర్ల మద్దతుతో లాభాల్లోకి స్టాక్‌ సూచీలు

Stock market: ఐటీ, ఆటో షేర్ల మద్దతుతో లాభాల్లోకి స్టాక్‌ సూచీలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 11, 2025
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ షేర్‌ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు, తర్వాత కోలుకుని మళ్లీ పెరుగుదల చూపించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల సంకేతాలు, ఐటీ, ఆటో, మెటల్‌ రంగాల షేర్లలో కొనుగోళ్లు కొనసాగడం కారణంగా సూచీలు రాణించాయి. దీంతో నిఫ్టీ 25,700 స్థాయికి చేరింది. సెన్సెక్స్ ఉదయం 83,671.52 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 83,535.35) స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 83,124.03 వద్ద కనిష్ఠానికి చేరింది. మధ్యాహ్నం తర్వాత పుంజుకొని 83,936.47 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 335.97 పాయింట్ల లాభంతో 83,871.32 వద్ద స్థిరపడింది.

Details

లాభాల్లో అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా

నిఫ్టీ కూడా 120.60 పాయింట్ల లాభంతో 25,694.95కి చేరింది. రూపాయి-డాలర్ మారకం విలువ 88.57గా నిలిచింది. సెన్సెక్స్ 30లో బీఎల్‌, అదానీ పోర్ట్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటెర్నల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. అయితే బజాజ్‌ ఫైనాన్స్, బజాజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్, టీఎంపీవీ, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడ్‌ 64 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది. బంగారం ఔన్సు ధర 4142 డాలర్ల వద్ద ఉంది.