
Stock market : భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు చిన్నపాటి ఒడిదుడుకుల తర్వాత స్వల్ప లాభాలతో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు మార్కెట్‌ను కొంత వరకు ప్రభావితం చేశాయి.
అయితే, ఆర్ బి ఐ ఎంపీసీ సమావేశం నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
ఆర్‌బీఐ గవర్నర్ నేతృత్వంలో ఈ సమావేశం నేడు ప్రారంభమైంది, శుక్రవారం కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.
వడ్డీ రేట్లలో మార్పు పెద్దగా ఆశించకపోయినా, సీఆర్‌ఆర్ తగ్గింపుపై ఉన్న అంచనాలతో బ్యాంకింగ్ స్టాక్స్ మంచి ప్రదర్శనను కనబరిచాయి.
వివరాలు
బంగారం ఔన్సు ధర 2663 డాలర్లు
సెన్సెక్స్ ఉదయం 81,036.22 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమై, ఇంట్రాడేలో 80,630.53 నుంచి 81,245.39 పాయింట్ల మధ్య కదిలింది.
చివరికి 110.58 పాయింట్ల లాభంతో 80,956.33 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ కూడా 10.30 పాయింట్ల లాభంతో 24,467 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.74 వద్ద నిలిచింది.
సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, టీసీఎస్, టైటాన్ వంటి స్టాక్స్ లాభపడ్డాయి.
భారతీ ఎయిర్‌టెల్,టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, మారుతి సుజుకీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.
అంతర్జాతీయ విపణిలో, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 74.05 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర 2663 డాలర్ల వద్ద ఉంది.