Stock Market: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 800+ పాయింట్లు పతనం
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు పెట్టుబడిదారుల్లో భయాందోళనలను పెంచుతున్నాయి. ముఖ్యంగా యుద్ధం ముగింపు పై స్పష్టత లేకపోవడం,అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వేగంగా పెరగడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి. అదనంగా, ఇరాన్‌కు మద్దతుగా హూతీ గ్రూప్ రంగంలోకి దిగిన వార్తలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
వివరాలు
నిఫ్టీ @22,575
ఈ నేపథ్యంలో, దేశీయ సూచీలు ప్రారంభం నుంచే తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లాయి. ట్రేడింగ్ ప్రారంభ సమయంలోనే సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా పడిపోవడం పెట్టుబడిదారులలో కలవరాన్ని రేకెత్తించింది. ఉదయం 9:29 గంటల సమయానికి సెన్సెక్స్ 858 పాయింట్లు కోల్పోయి 72,724 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో నిఫ్టీ 244 పాయింట్లు తగ్గి 22,575 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు, అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ 93.57 వద్ద ఉంది. అయితే ఇది గత సెషన్‌తో పోల్చితే స్వల్పంగా కోలుకున్నట్లు కనిపిస్తోంది.