Loading...
Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 352 పాయింట్లు డౌన్
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 352 పాయింట్లు డౌన్

Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 352 పాయింట్లు డౌన్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2026
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు అధిక స్థాయిలో ఉండటం సూచీలపై ప్రభావం చూపాయి. ఎఫ్‌ఎంసీజీ,ఐటీ,ఎనర్జీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.అయితే ఆటోమొబైల్, బ్యాంకింగ్ రంగాల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సూచీలు భారీ నష్టాల నుంచి కొంతమేర కోలుకున్నాయి. సెన్సెక్స్ గత ముగింపు 73,598.67 పాయింట్లతో పోలిస్తే 73,253.44పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి రోజంతా ఒడుదొడుకుల మధ్య నష్టాల్లోనే కొనసాగింది. ఒక దశలో దాదాపు 1,000 పాయింట్లు పడిపోయి 72,603.57పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. ఆ తర్వాత కొనుగోళ్లు పెరగడంతో సూచీ కోలుకుంది. అయినప్పటికీ చివరకు 352.64 పాయింట్ల నష్టంతో 73,246.03 వద్ద ముగిసింది.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌ 115 డాలర్లు 

మరోవైపు నిఫ్టీ 47.20 పాయింట్లు తగ్గి 22,702.55 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.22గా నమోదైంది.

సెన్సెక్స్ 30 సూచీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు ప్రధానంగా నష్టాలను చవిచూశాయి.

మరోవైపు ఎల్‌అండ్‌టీ, ట్రెంట్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఇండిగో షేర్లలో లాభాలు నమోదయ్యాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 115 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర ఔన్సుకు 4,049.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

చమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగడం, పశ్చిమాసియా పరిస్థితులు మదుపర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి.

ADVERTISEMENT