Loading...
Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు.. 152 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు.. 152 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు.. 152 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2026
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు,అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. మరోవైపు,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును 5.25 శాతం వద్దే కొనసాగిస్తూ ఎలాంటి మార్పులు చేయకపోవడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్ చివరి గంటలో కోలుకుని గ్రీన్‌లో ముగిసింది. ఉదయం క్రితం ముగింపు 78,428.95 పాయింట్లతో పోలిస్తే లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ 79,055.38 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 80.69 డాలర్లు 

అనంతరం అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకుని 78,285.74పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.చివరకు 152.05 పాయింట్లు లాభపడి 78,581పాయింట్ల వద్ద ముగిసింది.

నిఫ్టీ కూడా రోజంతా హెచ్చుతగ్గులు ఎదుర్కొని చివరకు 9.75పాయింట్లు పెరిగి 24,624.65పాయింట్ల వద్ద స్థిరపడింది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.13 వద్ద కొనసాగింది. సెన్సెక్స్‌లోని 30 ప్రధాన కంపెనీల్లో అల్ట్రాటెక్ సిమెంట్,ఎన్‌టీపీసీ,ఎస్‌బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా,ఇండిగో, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

మరోవైపు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బీఈఎల్, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 80.69 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అలాగే బంగారం ఔన్స్ ధర 4,152.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ADVERTISEMENT