Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ లాభాలతో మొదలైనప్పటికీ, తరువాత సెషన్‌లో విక్రయాలు పెరగడంతో సూచీలు దిగువ దిశలో కదిలాయి. ముఖ్యంగా మెటల్, పవర్, రియల్టీ మరియు మీడియా రంగాల్లో అమ్మకాలు పెరగడం మార్కెట్లపై ఒత్తిడిని పెంచింది. ఫలితంగా సెన్సెక్స్ 140 పాయింట్లకుపైగా వెనకడుగు వేయగా, నిఫ్టీ కూడా 87 పాయింట్లు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 63 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు మళ్లీ 4 వేల డాలర్ల మార్కును అధిగమించి ట్రేడింగ్‌లో ఉంది.
వివరాలు
డాలర్-రూపాయి మారకం విలువ ₹88.61
ఈరోజు సెన్సెక్స్ 83,516.69 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు: 83,459.15) ప్రారంభమైంది. రోజంతా 83,237.65 నుండి 83,846.35 పాయింట్ల మధ్య ఊగిసలాటలో ట్రేడైంది. చివరకు 148.14 పాయింట్లు నష్టపోయి 83,311.01 వద్ద సెషన్ ముగిసింది. మరోవైపు నిఫ్టీ 87.95 పాయింట్లు తగ్గి 25,509.70 వద్ద కదలాడింది. డాలర్-రూపాయి మారకం విలువ ₹88.61 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో పవర్‌గ్రిడ్, ఎటెర్నల్, బీఈఎల్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఇక ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, మహీంద్రా & మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, మారుతీ షేర్లు లాభాలను నమోదు చేశాయి.