
Stock Market : భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. 23,050 దాటిన నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ,సూచీలు స్థిరంగా రాణిస్తున్నాయి.
ప్రధాన షేర్ల కొనుగోళ్లలో మదుపర్లు ఆసక్తి చూపడం వల్ల మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
మార్కెట్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 400 పాయింట్ల లాభంతో,నిఫ్టీ 23,000 మార్క్ పై ట్రేడింగ్ ప్రారంభించింది.
ఉదయం 9:30 గంటలకు,సెన్సెక్స్ 523 పాయింట్లు పెరిగి 75,972 వద్ద ట్రేడవుతుండగా,నిఫ్టీ 150 పాయింట్లు పెరిగి 23,058 వద్ద ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్,జొమాటో,ఎం అండ్ ఎం,హెచ్‌సీఎల్ టెక్నాలజీస్,టెక్ మహీంద్రా, టీసీఎస్,భారతీ ఎయిర్‌టెల్,ఇండస్‌ఇండ్ బ్యాంక్,ఎస్‌బీఐ, టైటాన్,ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
అయితే, అల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ షేర్లు మాత్రం నష్టాల్లో ఉన్నాయి.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 71.19 డాలర్లు
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 71.19 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు 3,057.30 డాలర్ల మార్క్‌ను దాటి కొనసాగుతోంది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.41 వద్ద కొనసాగుతోంది.అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా కొనసాగించింది.
ప్రస్తుతం ఉన్న 4.25 - 4.5 శాతం బెంచ్‌మార్క్ వడ్డీ రేట్ల శ్రేణినే కొనసాగించాలని తాజా సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో, బుధవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి.
వివరాలు
1% నష్టంతో షాంఘై
ఎస్‌అండ్‌పీ సూచీ 1.08%, నాస్‌డాక్ 1.41% పెరిగాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
జపాన్ నిక్కీ, హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీలు బలహీనంగా కొనసాగుతుండగా, షాంఘై 1% నష్టంతో కదలాడుతోంది.
విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) తిరిగి విక్రయదారులుగా మారారు.
బుధవారం నికరంగా ₹1,097 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అయితే, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా ₹2,141 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు.