LOADING...
Stock Market : ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,204
ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,204

Stock Market : ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,204

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2025
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం స్థిరంగా ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉండగా కూడా, మదుపరులు జాగ్రత్తగా వ్యవహరించారు. సెన్సెక్స్ ఈ ఉదయం 82,147.37 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు: 82,159.97) స్వల్ప నష్టాలతో ప్రారంభమై, ఇంట్రాడేలో 81,776.53 నుంచి 82,370.38 పాయింట్ల వరకు కదలాడింది. చివరికి 10 పాయింట్ల నష్టంతో 82,149.72 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 2.15 పాయింట్లు పెరిగి 25,204.50 పాయింట్ల వద్ద కొనసాగింది. సెన్సెక్స్ 30లో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ, యాక్సిస్ బ్యాంక్‌, బజాజ్ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ వంటి కంపెనీ షేర్లు లాభాలు పొందగా, ట్రెంట్‌, టెక్ మహీంద్ర, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌యూఎల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టంతో ముగిశాయి.